Wednesday, December 21, 2011

bleeding after Hysterectomy,గర్భసంచిని తొలగించారు అయినా రక్తస్రావం కనిపిస్తోంది

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము


Q : నాకు యాభైఅయిదేళ్లు. కొన్ని కారణాల వల్ల ఏడాది క్రితం గర్భసంచిని తొలగించారు. అయితే నాలుగు నెలలుగా అప్పుడప్పుడు రక్తస్రావం కనిపిస్తోంది. జననేంద్రియాల దగ్గర విపరీతమైన నొప్పి, మంట కూడా బాధిస్తున్నాయి. ఇదేమైనా ప్రమాద సంకేతమా. ఇతర సమస్యలేమైనా వస్తాయని భయంగా ఉంది.

A : గర్భాశయాన్ని తొలగించాక నెలసరి ఆగిపోతుంది. దాంతో రక్తస్రావం కాకూడదు. మీకు అప్పుడప్పుడు అవుతోందంటే.. హార్మోన్ల లేమి, కొన్నిరకాల ఇన్‌ఫెక్షన్లు, శస్త్రచికిత్స తరవాత కుట్లు సరిగ్గా అతుక్కోకపోవడం వల్ల కూడా ఇలాంటి సమస్య ఎదురుకావచ్చు. చాలా అరుదుగా మాత్రం క్యాన్సర్‌ కావచ్చు. కాబట్టి ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి. చిన్నచిన్న ఇన్‌ఫెక్షన్లే అయితే.. మందులు వాడితే సరిపోతుంది. కాబట్టి భయపడాల్సిన అవసరంలేదు.
  • .==========================
visit my website - > Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.