Sunday, December 4, 2011

Non-veg and Veg.Which is good for health,మాంసాహారం మంచిదా? శాకాహారమా?



  • ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర: మేము ఎస్‌ఎస్‌వై క్లాసుకు వెళ్లినప్పుడు మాంసాహారం మానేయమని చెప్పారు. మేము మాంసాహారులం. ఇంట్లో పెరిగే పిల్లలున్నారు. ఒకేసారి మాంసాహారాన్ని మానేస్తే నీరసం రావటం వంటి ఇబ్బందులు ఏవన్నా వస్తాయా? వెజిటబుల్ ప్రోటీన్ కంటే యానిమల్ ప్రోటీన్ క్వాలిటీ ఎక్కువట కదా? ఇంతకీ, మాంసాహారం మంచిదా? శాకాహారమా?

జ: ఆయుర్వేదం మాంసాహారాన్ని తీసిపారెయ్యలేదు. పైగా, మాంసవర్గం కింద వివిధ జంతుమాంసాల గుణ ధర్మాలను వివరించింది కూడా! అయితే మాంసాహారం, శాకాహారం- వీటిలో ఏది మంచిది అన్న సమస్య ఉత్పన్నమైనప్పుడు, ఆయుర్వేద గ్రంథాలను లోతుగా పరిశీలిస్తే, శాకాహారానికే ప్రాధాన్యత ఇచ్చినట్టు కనబడుతోంది. ఇటీవల బ్రిటన్‌లో ఒక ఆసక్తికరమైన సర్వేని నిర్వహించారు. సుమారు పదివేల మంది ప్రజల తాలూకు ఆరోగ్యాన్ని, వారి భోజనపు అలవాట్లతో ముడిపెట్టి అధ్యయనం చేసినప్పుడు, మాంసాహారుల కంటే శాకాహారులే ఎక్కువ ఆరోగ్యంతో ఉన్నారని తేలింది. అంతేకాదు, శాకాహారుల్లో జీర్ణాశయానికి సంబంధించిన క్యాన్సర్, గుండె జబ్బులు వంటివి తక్కువగా కనిపించినట్టు తేలింది. అయితే శాకాహారుల ఆరోగ్య రహస్యం కేవలం మాంసం తినకపోవడంలోనే లేదని పరిశీలనలు వెల్లడిస్తున్నాయి. శాకాహారంలో ఎక్కువగా పీచు పదార్థాలు, విటమిన్లు కలిగిన కూరగాయలు, పండ్లు ఉంటాయని, అవి వివిధ రకాలైన క్యాన్సర్లను, అకాల వార్ధక్యాన్ని, గుండె జబ్బులను నిరోధిస్తాయని గ్రహించాలి. మీరు మాంసాహారులమంటున్నారు కనుక మాంసాన్ని వదిలేయకుండానే, సాధ్యమైన ఎక్కువగా శాకాహారాన్ని తీసుకోవడం మంచిది. శాకాహారం మనిషికి కావలసిన సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించగలదని శాస్ర్తియంగా రుజువయ్యింది.
  • =================================================

visit my website - > Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.