Tuesday, December 20, 2011

హైడ్రామ్నియాస్ ,ఆలిగో ఆమ్నియాస్,Hydromnios , oligoamnios

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .


Q : నా వయసు 22. పెళ్లై 8 నెలలు అవుతోంది. పెళ్లైన 2 నెలలకు కన్సీవ్ అయ్యాను. స్కానింగ్ చేస్తే బేబీ బాగానే ఉందని, ఏ ప్రాబ్లమ్ లేదని చెప్పారు. 6వ నెలలో వెళ్లినప్పుడు స్కానింగ్ తీసి, లిక్విడ్ చాలా తక్కువగా ఉందని, బేబీ పెరగడం కష్టమని, అబార్షన్ చేయించడం మంచిదని చెప్పారు. దాంతో కిందటి నెల 30న అబార్షన్ చేయించుకున్నాను. బెంగుళూర్ వెళితే CHRONOSOMAL ANALYSISచేయాలన్నారు. ఇది ఎందుకు చేస్తారు? ముందు అంతా బాగుంది. తర్వాత లిక్విడ్ ఎందుకు తగ్గింది? తర్వాత ప్రెగ్నెన్సీ ఇలా జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? టెన్షన్స్ ఎక్కువగా ఉంటే ఇలా జరుగుతుందా? నా సందేహాలకు సరైన సమాధానం తెలియజేయగలరు.


A : బిడ్డ చుట్టూ ఉండే ఉమ్మనీరు బిడ్డకు ఎన్నో రకాలుగా సహాయపడుతుంది. బయట నుంచి తల్లి పొట్టపై కలిగే ఒత్తిడి నుండి బిడ్డను కాపాడటమే గాక బిడ్డ కదలికలకు అనువుగా ఉండేందుకు, బిడ్డ ఊపిరితిత్తులు క్రమంగా అభివృద్ధి చెందేందుకు, అలాగే బిడ్డ ఎదగడానికి కావల్సిన చోటును ఉమ్మనీరు సమకూరుస్తుంది. స్కానింగ్ ద్వారా 5వ నెల నుంచి దీనిని కొలవడం జరుగుతుంది. తక్కువగా ఉన్నప్పుడు ఆలిగో ఆమ్నియాస్ అని, చాలా ఎక్కువగా ఉన్నప్పుడు హైడ్రామ్నియాస్ అని పిలుస్తాం. మీ విషయంలో ఉమ్మనీరు 6వ నెలలో చాలా తక్కువగా ఉందని చెప్పారన్నారు. దానికి గల కొన్ని ముఖ్యమైన కారణాలు:

ఉమ్మనీరు కారిపోవడం: కొన్ని సందర్భాలలో నెలలు నిండకముందే, నొప్పులు రాకముందే, ఉమ్మనీరు పడిపోవచ్చు. మొదటిసారి గర్భిణిగా ఉన్న స్ర్తీలు దీనిని ఉమ్మనీరుగా గుర్తించక తెల్లబట్ట ఎక్కువగా అవుతోందనుకొని పొరపాటు పడటం సర్వసాధారణంగా జరుగుతుంది.

తొమ్మిది నెలలు దాటిపోవడం: నెలలు నిండిపోయి ఎక్కువ రోజులు అయినా ఉమ్మనీరు తగ్గిపోవడం గమనిస్తాం. ఈ కారణం మీ విషయంలో వర్తించదు.

బిడ్డ కిడ్నీకి సంబంధించిన లోపాలు ఉండటం: ఇటువంటి సందర్భాలలో బిడ్డ మూత్రాన్ని చాలా తక్కువగా విసర్జించడం జరుగుతుంది. అందుచేత ఉమ్మనీరు కూడా తక్కువగా ఉంటుంది.

బిడ్డకు జన్యుపరమైన జబ్బులు ఉండటం.

యామ్నియో సెంటిసిస్ లేదా సివిఎస్ వంటి పరీక్షలు చేసినప్పుడు ఉమ్మనీరు తాత్కాలికంగా తగ్గిపోవడాన్ని గమనించవచ్చు.

నాలుగు నుండి ఆరు నెలలలో ఉమ్మనీరు తక్కువగా ఉండటాన్ని గమనించినప్పుడు బిడ్డ ఆరోగ్యంగా ఎదగడానికి అవకాశం తక్కువనే చెప్పవచ్చు. అటువంటి సందర్భాలలో అబార్షన్ చేయించుకోమని డాక్టర్లు సలహా ఇస్తారు. కొన్ని సందర్భాలలో ప్రెగ్నెన్సీలో వచ్చే హై బి.పి వల్ల బిడ్డకు రక్తప్రసరణ సరిగ్గా అందక ఉమ్మనీరు తగ్గి బిడ్డ ఎదుగుదల తక్కువగా ఉండవచ్చు. ఇలా అబార్షన్ అయిన వారికి క్రోమోజోమ్ ఎనాలసిస్ చేయడం వల్ల తర్వాత పుట్టబోయే బిడ్డకు జన్యుపరమైన లోపాలు కనిపెట్టడం సాధ్యం అవుతుంది. పైన వివరించిన కారణాలలో హై.బి.పి వంటి కారణాలు తప్ప మిగిలినవన్నీ నెక్ట్స్ ప్రెగ్నెన్సీలో వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అందుచేత మీరు ఆరు నెలల గ్యాప్ ఇచ్చిన తర్వాత నెక్ట్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి. ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లను ముందు నుంచి వాడండి.

ప్రెగ్నెన్సీ సమయంలో మంచి ఆహారం 3-4 లీటర్ల ద్రవపదార్థాలు 8-10 గంటల రోజు నిద్ర తప్పక తీసుకోండి. డాక్టర్ సూచనల మేరకు ఫోలిక్ యాసిడ్, ఐరన్, క్యాల్షియం, బి-కాంప్లెక్స్ వంటి సప్లిమెంట్స్ తప్పక వేసుకోండి. సీరియల్ గ్రోత్ స్కానింగ్ చేయించుకుంటూ ఉమ్మనీరు, బిడ్డ ఎదుగుదల సరిగ్గా ఉన్నదీ లేనిదీ పర్యవేక్షించండి. కొబ్బరినీళ్లు, బార్లీ నీళ్లు, మజ్జిగ వంటి ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోండి. ఐదవ నెల దాటాక వెల్లకిలా కాకుండా ఒక పక్కగా తిరిగి పడుకోండి. రెగ్యులర్‌గా బి.పి చెకప్ చేయించుకోండి. అనవసరమైన టెన్షన్లు ఏవీ పెట్టుకోక డాక్టర్ సూచనలన్నీ క్రమం తప్పకుండా పాటించి నెక్ట్స్ ప్రెగ్నెన్సీలో ఆరోగ్యకరమైన బిడ్డను పొందండి.

  • =========================
visit my website - > Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.