Wednesday, November 21, 2012

Exercises in Pregnency - గర్భిణీ చేయవలసిన వ్యాయామము

  • Image : Courtesy with :  http://www.promdinurses.com/2009/07/exercise-during-pregnancy.html



  • ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
ప్ర : నేను గర్భము దాల్చాను . ఎటువంటి ఎక్చర్ సైజులు చేయవచ్చు ?

జ :  లాభాలు :
గర్భిణీ గా ఉన్నప్పుడు వ్యాయామము చేయడచు వలన మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చును . బరువు అతిగా పెరగకుండా నియంత్రించవచ్చును.  ప్రతిరోజూ వ్యాయామము చేయడము వలన మీ శరీర ధారుడ్యము ప్రసవ వేదనను ఎదుర్కొనడానికి వీలు పడును. తుంటి ఎక్షరసైజుల వలన పురుడు సునాయాసము గాను , నార్మల్ గాను అయ్యేందుకు దోహదపడుతుంది.

చేయవలసిన వ్యాయామాలు :
  • వాకింగ్-- మంచి వ్యాయామము . మొదటి దశనుంది నెలలు నిండినవరకూ తేలికపాటి నడక రోజుకు 20 నిముషాలు చాలా మంచిది .
  • యోగా --తేలికపాటి రీతిలో యోగా చేయవచ్చును .
  • జాగింగ్ / రన్నింగ్ :  ఆయాసము రానంతవరకూ చిన్నగా జాగింగ్ గాని చిన్న పాటి రన్నింగ్ గాని చేయవచ్చును . జారి పడిపోకుండా జాగ్రత్త వహించాలి . నెలలు నిండిన వారు చేయకూడదు .
  • స్విమ్మింగ్ : గర్భము దాల్చిన మొదటి నుండి  చివరి వరకూ తేలిక పాటి ఈదడము చేయవచ్చును .


గర్భధారణ సమయంలో వ్యాయామం ఒక నిర్దిష్ట సమయం మరియు వ్యవధి ఉండాలి. జాగ్రత్తలు ఉన్నాయి:

  •      గర్భం ప్రమాదంలో సంకేతాలు ఉన్నాయి ఉంటే ఎప్పుడూ వ్యాయామము చేయకూడదు .
  •       అల్పరక్తపోటు నివారించడానికి ఎప్పుడూ నేల నుండి పైకి నెమ్మదిగా పైకి లేవాలి.  మొదటి వైపు రోల్ మరియు తరువాత ఉదర కండరాలపై వత్తిడి  నివారించడానికి వీలు పడేవిదంగా చేయాలి .
  •      కాలు  తిమ్మిరి నివారించడానికి కాళు ను  ఎప్పుడూ బిగపెట్ట వచ్చు .
  •      కండర అలసట నివారించడానికి తక్కువ  hyperextend చేయాలి .
  •      వ్యాయామం చేస్తున్నప్పుడు  మీ శ్వాసను బిగపట్టి ఉంచకూడదు .ఇది ఉదర మరియు గర్భాశయంలోని ఒత్తిడి పెంచుతుంది .
  •     ఈ శ్వాస తీసుకోవడము నెమ్మది నెమ్మది గా చేయాలి . లేకపోతే  గర్భాశయంలోని ఒత్తిడి మూలాన ఉమ్మనీటి పొర  చిట్లడం జరగవచ్చును.


  • ==============================
 visit my website - > Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.