Thursday, November 15, 2012

Come out of Negativity in Life -జీవితం నుంచి ప్రతికూలతల్ని ఏవిధంగా తొలగించుకోవాలి ?

  • ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : జీవితం నుంచి ప్రతికూలతల్ని ఏవిధంగా తొలగించుకోవాలి ?

జ : జీవితం లో ప్రతిఒక్కరికీ ఏదో ఒక చేదు అనుభవమో , చేదు జ్ఞాపకమో, అనారోగ్యమో , అవమానమో ఉంటునే ఉంటాయి. అంతమాత్రాన దిగులుతో ఉండరాదు . అన్నింటిన్నీ అధిగమిస్తూ జీవితం లో ముందుకు సాగిపోవాలి. ఎంతటి ఉన్నత ష్థాయికి వెళ్ళిన వ్యక్తిలోనైనా వృత్తిగత , వ్యక్తిగత సమస్యలుంటాయి. ఇది సహజము . కష్టము వెంట సుఖము , కన్నీటివెంట సంతోషము ఉంటనే ఉంటాయి. వాటంతటవి రావు . మనమే సంతోషము వెతుక్కుంటూ పరుగులు తీయాలి.

మెడడు కంటే హృదయము చెప్పే మాటల్నే ఎక్కువగా వింటుండాలి. బుర్ర కాలిక్యులేట్ చేస్తుంది . మనస్సు  స్పందిస్తుంది. ఎదుటివారు సంతోషముగా , ఉత్సాహముగా ఉన్నారు కాబట్టి వారికేం దిగుళ్ళూ, విచారాలు లేవనుకోకూడదు . వారికుండవలసిన చిక్కులు వారికీ ఉంటాయి కాని బయటకు కనిపించరు.  నిరంతరము చెడు అనుభవాలను , చెడు జ్ఞాపకాలను వదలి ... సంతోషకర క్షణాలనే మళ్ళీ మళ్ళీ స్పురించుకుంటూ ముందుకు సాగాలి. అప్పుడే జీవితం అనందముగా ఉంటుంది. ఇది అంత సాధ్యమైన పని కాదు. సాదనచేస్తే అసాధ్యమేమీ కాదు.
  • =======================
 visit my website - > Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.