Friday, November 23, 2012

నాకు 3 వారాలకొకసారి నెలసరి ఋతుక్రమము వస్తోంది . ఇది సహజమేనా?






  • ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . 
 ప్ర : నా వయసు 19 సం.లు. నాకు 3 వారాలకొకసారి నెలసరి ఋతుక్రమము వస్తోంది . ఇది సహజమేనా?.కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడాలా?

జ : ఋతుక్రమ సమయాన్ని రక్తస్రావము అయిన మొదటి రోజునుంచి  తదుపరి నెల మొదటిరోజుదాకా లెక్కించాలి. ఋతుక్రమాన్ని రెండు దశలుగా విభజిస్తారు.
మొదటిది : ఫాలిక్యులార్ ఫేజ్ (14 రోజులు ) , రెండోది : లూటియల్ ఫేజ్ (14 రోజులు ) . ఫాలిక్యులార్ ఫేజ్ కాలపరిమితి మారుతుంటుంది. కాని లూటియల్ ఫేజ్ సాధారణం గా అలాగే ఉంటుంది. సాధారణ పరిస్థితిలో 2-3 రోజులు తక్కువగా ఋతుక్రమము వస్తుంటుంది.
ఏది ఏమైనా ఋతుక్రమము ప్రతినెలా ఒకే కాలపరిమితిలో వస్తూ ఉంటే 21 రోజులనుండి 35 రోజుల మధ్య  నార్మల్ గానే పరిగణించాలి.

పీరియడ్స్ త్వరత్వరగా వస్తుంటే  సిస్ట్ లేదా ఓవరీస్ లో ఇన్‌ఫెక్షన్‌, హైపర్ థైరాయిడ్ ...  కారణము కావచ్చు .  ఋతుక్రమములో తాత్కాలికము గా మార్పు వస్తే అది అధిక ఒత్తిడి వలన కావచ్చును. 2-3 నెలలు పాటు ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడితే ఋతువు(నెలసరి) క్రమబద్ధము అవుతుంది . ఈ పిల్స్ వాడడానికి ముందు కారణాన్ని గుత్తించాలి. అందుకు గాను వైద్యురాలిని సంప్రదించాలి. కాంట్రాసెప్టివ్ పిల్స్ తాత్కాలికముగా శరీరము లో ఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజన్‌ , ప్రొజెస్టరాన్‌ లను తగ్గిస్తాయి. వైద్యులు సూచించిన మేరకు కాంట్రాసెప్టివ్ పిల్స్ తీసుకోవడము వల్ల ఏ ఇబ్బందీ ఉండదు. ఇవి సురక్షితమైనవా? .. కావా? అన్న సందేహానికి తావులేదు.


  • ===============================
 visit my website - > Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.