Wednesday, November 14, 2012

గర్భిణీ స్త్రీలు బొప్పాయి , అనాస పండ్లు తినకూడదంటారు ,ఎందుకని ?

  • ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . 
 ప్ర : గర్భిణీ స్త్రీలు బొప్పాయి , అనాస పండ్లు తినకూడదంటారు ,ఎందుకని ?

జ : ఆహారానికి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కోవిధంగా చెప్తూ అపోహలకు గురిచెస్తుంటారు. ఇలా వింటూ పోతే చివరకు తినడానికి ఏవీ మిగలవు . ఇది మంచి ఆలోచన కాదు . గర్భము దాల్చాక ఆరోగ్యవంతమైన ఆహారము తినాలి . బొప్పాయి , అనాస పండ్లే కాకుండా మీట్ , చేపలు , చీజ్ , సాల్ట్ , స్పిసెస్  మొదలైనవి కూడా గినకూడదని చాలామంది  చెప్తుంటారు . నిజానికి వీటికి సంబంధించి శాస్త్రీయ సాక్ష్యాధారాలేవీ లేవు . ప్రాసెస్డ్ మీట్ , సాఫ్ట్ చీజ్ వంటి వాటిలో బాక్టీరియా ఎక్కువ ఉండే పదార్ధాలు తినకూడదు . కొంతమందికి కొన్ని పదార్ధాల టాలరెన్స్  ఉండదు , అటువంటి వాటిని జాగ్రత్తగా గుర్తించి మానివేయాలి.

కాబట్టి  ఇది పడదు , అది తగదు అన్న ఆలోచనలు చేయవద్దు . తాజా పండ్లు , కాయకూరలు , తినండి . మీరు చికిత్స తీసుకునే వైద్యురాలి సలహా మాత్రమే అనుసరిస్తూ అన్ని ఆహారపదార్ధాలు తినవచ్చును .
  • =================================
 visit my website - > Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.