Monday, November 30, 2009

రుతుక్రమం లో వచ్చే ఇబ్బందులు , Discomfort during Menses




ప్ర : రుతుక్రమ సమయం లో వచ్చే ఇబ్బందులను తగ్గించుకోవడానికి పెయిన్ కిల్లర్సే మార్గమా ?

: చాలామంది రుతుక్రమ సమయం లో ఏదో ఒక రకం గా ఇబ్బంది పడుతుంటారు . వీటిని తాత్కాలికం గా ఉపశయం చెందడానికి మాత్రలు వేసుకొంటారు . క్రాంప్స్ , నొప్పులు , అధికరక్తశ్రావము , మంట వంటి నెలసరి లక్షణాలు ... శరీరం లో కనిపించే " ప్రోస్టా గ్లాండిన్స్ " అనే రాసానం వల్ల కలుగుతాయి . . . కావున పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే ఈ రసాయనం ఉత్పత్తి తగ్గి ఉపశమనం కలుగుతుంది . కావున పీరియడ్స్ రోజులలో మాత్రలు తప్పవు .

ఈస్త్రోజన్ హార్మోన్ స్థాయి పెరగడం వల్ల కుడా ఈ బాధలు కలుగవచ్చును . మనం తీసుకునే ఆహారపదర్దాలు ఇందుకు కారణం అవుతాయి . ఆహార పానీయాల్లో మార్పులు చేసుకోవాలి .పీచు ఎక్కువగా ఉండే పదార్ధాలు తీసుకోవాలి .పండ్లు , కాయధాన్యాలు , చిక్కుడు ,ఆకుకూరలు , బటానీలు తినాలి , మాంసాహార పదార్ధాలు , వెజిటబుల్ ఆయిల్స్ వాడకూడదు . కొవ్వుపదార్ధాలు అస్సలు తినకూడదు . ప్రతిరోజూ వ్యాయామము(briskWalking) చేయాలి .

  • =============================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.