Friday, November 20, 2009

ట్యానింగ్ ను తొలగించడం , Tanning to remove


  •  

  •  
 ఫ్ర : చర్మం పై ఏర్పడే ట్యానింగ్ ను తొలగించుకోవడానికి ఇంట్లో అనుసరించే పద్దతులు ఏమిటో తెలియజేయండి ?.... రమేష్ సున్నపు వీధి , శ్రీకాకుళం టౌన్ .



 జ :
ట్యానింగ్‌: ఎండలో ఎక్కువగా తిరిగినపుడు చర్మం కమలడం, రంగు మారడం (ట్యానింగ్‌ అంటే పిగ్మెంటేషన్‌) సహజం. మన శరీరానికి కొంతవరకూ ఈ మార్పు మంచిదే. సూర్యరశ్మి నుండి వచ్చే అతినీలలోహిత కిరణాలనుండి తట్టుకోవడానికి ఇది తోడ్పడుతుంది.  ఇది ఒక్క వేసవిలోనే కాకుండా ఏ కాలం లోనైనా వచ్చే సమస్య .
  • చికిత్స :
1 . ఒక టేబుల్ స్పూన్ పాలు లేదా క్రీమ్ , ఒక టేబుల్ స్పూన్ తేనే , ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం , అర టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ , కలిపి ముఖానికి(చేతులకు ) అద్ది 10 - 15 నిముషాలు ఆగి కడిగేయాలి . దీనివల్ల ట్యానింగ్ తగ్గడమే కాకుండా చర్మానికి మంచి నిగారింపు వస్తుంది .

2 . ఒక టేబుల్ స్పూన్ పసుపు , నిమ్మరసము కలుపుకొని ట్యానింగ్ ఉన్నా చోట రాసి 20 నిముషాలు ఆగి చల్లని నీతితో కడిగేయాలి.నిమ్మ సహజ సిద్ధమైన బ్లీచ్ .

3 . టమాటో గుజ్జును నిమ్మ లేదా నారింజ రసం లో కలిపి రాసి 20 నిముషాలు ఆగి కడిగేయాలి . చర్మము మంచి రంగు తో మేరిసేతట్లు తయారవుతుంది . పొడి చర్మం గలవారైతే అర-టీ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ కలుపుకోవాలి .

4 . స్ట్రాబెర్రీ గుజ్జు , పంచదార , నిమ్మ రసం కలుపు కొని ట్యానింగ్ గల ప్రదేశాలలో స్క్రుబ్ గా ఉపయోగించుకోవచ్చు . సున్నితమైన చర్మం కలవారైతే కాసిని బాదం పప్పును రాత్రంతా నానబెట్టి తోలుతీసి రుబ్బి పుల్లని పెరుగు లేదా క్రీం తో కలిపి రాస్తే మరింత ఫలితం కనిపిస్తుంది .

రెడీ మేడ్ గా లబించే సన్ స్క్రీన్ క్రీములను బయట ఎండ లోనికి వెళ్ళే ముందు రాసుకోవాలి . మంచి ఫలితం ఉంటుంది .

  • ================================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.