Friday, November 20, 2009

రుతుక్రమము హెచ్చు తగ్గులు , Irregular periods

ప్రశ్న : నా వయసు 19 సంవత్సరాలు ... గత ఏడాదిగా నా రుతుక్రమము సరిగా లేదు . టైం కి రావడం లేదు .. పొత్తికడుపు లో నొప్పి కుడా వస్తుంది . సాధారణం కంటే రుతుక్రమం తక్కువగా ఉంటుంది . కారణం ఏమయి ఉంటుంది ? (కల్పన రెంట - కళింగపట్నం )



జ : మీ వయసు 19 సం. అని అన్నారు ... ఈ వయసు లో రుతుక్రమం రెగ్యులర్ గా లేకపోవడమన్నది సర్వ సాధారణమే . హార్మోన్ల స్థాయిల్లో అసమతుల్యం వల్లే ఇలా జరుగుతుంటుంది . ఈ సమస్య సహజం గానే రెండేళ్ళ లో సర్దు కుంటుంది . రక్త హీనత ఉందేమో పరీక్షలు చేయించుకోండి . హీమోగ్లోబిన్ స్థాయి ని అంచనా వేయడం అవసరం . .

కడుపు లో పొట్టపురుగులు లేకుండా పాముల మందును (worminTablet) తీసుకోండి ,
అవసరమనుకుంటే రోజు ఐరన్ మాత్రలు వాడండి .
వ్యాయామం చేయడం చాలా మంచిది .
పాలు , గుడ్లు , పండ్లు ,ఆకుకూరలు పుష్కలం గా తినండి .
మందులు వాడే ముందు లేడీ డాక్టర్ ని సంప్రదిస్తే మంచిది .

  • ==============================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.