Monday, April 1, 2013

Leenar face desire , కోల ముఖము కోసము పద్దుతులు

  •  
  • Image : courtesy with  -> http://vasundharaeenadu.blogspot.in

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : నా వయసు 25 సం.లు . ముఖం గుండ్రము గా చబ్బీగా ఉంటుంది. నాకు లీనర్(కోల) ఫేస్ ఇస్టము . దీనికోసము ఏదైనా పద్దతులు తెలియజేయండి?

జ : ముఖ ఆకృతులు రకరకాలు గా ఉంటాయి. ప్రతి ఆకృతి దానికదే అందము గా కనిపిస్తుంది. ఎదుట వారికి మాత్రము కొన్నే నచ్చుతాయి. . . కొందరికి కొన్ని ఇస్టపడతాయి. ముఖ ఆకృతి ఫేసియల్ బోన్సు అమరిక పైన . తరువాత ముఖము పైఉన్న కండరాల పెరుగుదల పైన , ముఖము పై పెరిగే కొవ్వు (ఫ్యాట్) పైనా అదారపడి ఉంటుంది. నవీన కాస్మొటిక్ పద్దతులు వలన కొంతవరకు , మేకప్ వలన కొంతవరకూ ముఖము ఆకృతిని మార్చుకోవచ్చును. 

ముఖము కోల గా ఉండాలంటే ముందుగా చేయాల్సింది బరువు తగ్గడం , ఇందుకోసము ' కార్డియో వాస్క్యులర్ వర్కవుట్ లు చేయండి . ముఖము పై కొవ్వు తొలగడానికి కార్డియో అద్భుతమైన వ్యాయామము. ఒకవేళ మీ ముఖం చబ్బీగా ఉండడానికి కండరాలు కారనమయితే ... వైద్యుని సంప్రదించండి . కొద్దిపాటి బోటోక్స్ ఇంజెక్షన్లు , జూలైన్‌ను అందం గా నిర్వచిస్తాయి . ఓవల్ -ఫేస్ ముఖమైతే చీక్ బోన్స్ సైడ్సు లో డాక్టర్లు కొద్దిగా పిల్లర్ ఇంజక్షన్‌ చేస్తారు .
  • =========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.