Tuesday, April 2, 2013

డెలివరీ అయిన తరువాత బ్లాడర్ కంట్రోల్ ఉండడము లేదు , Bladder is not in controle after Delivery?

  •  


ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 Q : నేను ప్రసవం అయిన దగ్గరనుండి ... అంటే ఏడాదిగా కొన్నిసార్లు బ్లాడర్ కంట్రోల్ ఉండడము లేదు . బరువులు ఎత్తినపుడు , వ్యాయామము చేసినపుడు నీరుడు జారిపోతూ ఉంటుంది . చికిత్స తెలియజేయగలరు .

జవాబు : కొంతమందికి డెలివరీ అయిన తరువాత ఇలా జరుగుతూ ఉంటుంది. వివిధ టిష్యూల లాక్సిటీ వలన ఇలా అవుతుంది . ఈ టిష్యూలు బ్లాడర్  గోడను సపోర్ట్ చేస్తుంటాయి. ప్రసవం సమయములో వీటికి కొంత ఇంజురీ జరుగుతుంది.  ఈ ఇబ్బంది దానికదే కొద్దినెలలో సర్దుకుంటుంది.  ఏవిధమైన ఇన్‌ఫెక్షన్‌ లేదన్న నిర్ధారణకోసము యూరినరీ పరీక్షలు చేయించుకోండి. బ్లడ్ సుగర్ స్థాయిలు , బి.పి మున్నగునవి  లాబ్ పరీక్షలు చేయించుకొని ఏవ్యాధి లేధని తెలిసిన తరువాత ... కీగల్ ఎక్సరసైజులు ప్రతిరోజూ చేయండి . దీనివలన మూత్రాశయం గోడలు బలోపితం అవుతాయి.
  • =========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.