Saturday, March 2, 2013

మా అమ్మ నాన్నని ఇన్‌ఫోమానియా అని అంటుంది. ఇదేమైనాజబ్బా?,What is Infomania? Is it a disease?.

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

  ప్రశ్న : మా అమ్మ నాన్నని ఇన్‌ఫోమానియా అని అంటుంది. ఇదేమైనాజబ్బా?,What is Infomania? Is it a disease?.


జవాబు : ఉదయమనగా ఉద్యోగాలకు వెళ్ళి సాయంత్రం  ఇంటికి చేరగానే భార్యాభర్తలిద్దరూ కొంతసేపైనా సరదాగా కలిసి గడపాలనుకుంటారు. పేరుకుపోయిన కబుర్లు విప్పి చెప్పుకోవాలనుకుంటారు. ఇద్దరూ అలాగే అనుకుంటే ... ఓ.కే. కాని ఆ ఇద్దరిలోఎవరైనా ఇంటికి వచ్చీరాగానే ట్విట్టర్ లొనో , ఫేస్ బుక్ లోనో తల దూర్చుతుంటే , చూసేవారికి కోపం కట్టలు కట్టలు గా రావడం పక్కనబెడితే ... చేసేవారికి " ఇన్‌ఫోమానియా " ఉన్నట్లు లెక్క.

అంటే స్మార్ట్ ఫోన్‌ కు ఇది అనారోగ్యకరమైన ఎడిక్షన్‌ అన్నమాట . సెల్ ఫోన్‌ కో , కంప్యూటర్ కో నిరంతం సమాచారము ... జోక్స్ , ఎస్.ఎం.ఎస్ లు , ఈమెయిల్స్ , యానిమేషన్‌ వీడియోస్ తగవచ్చి సమాచారము ఓవర్లోడ్ అయిపోతుంది. కొత్త లో సమాచారము ఏమిటో? అని చూడ్డం మొదలు పెడతారు. అలా చూస్తూ దానికి అలవాటైపోతారు ... అది కాస్తా ఎడిక్షన్‌ గా మారిఫోతుంది. 1980 సం. తరువాత నుండి ఈ టెక్నాలజీ అభివృద్ధి అయి యూజర్ లలో ఇది ఒక  "సైకొలాజికల్  డెబిలిటీ(psychological debility)" గా మారినది.

పడకచేరే సమయమైనా ఫోన్‌ వదలక పోతే మరీ ఎక్కువ ముప్పు తప్పదు. ఇటువంటి ధోరణి  వైవాహిక బాంధవ్యం పై తీవ్రపరిణామాలు చూపగలదు . ఇది భారీ సమస్యలకు దారి తీస్తుంది. ఏ పార్టీకో , మరే ఇతర కార్యక్రమాలకో వెళ్ళినా లేదా ఇంటిలోనైనా తనేదో పనిలో ఉన్నట్లు ఈ టెక్నాలజీ ఇన్‌ఫర్మేషన్‌ లో మునిగిపోతారు. మనసు అటే లాగుతుంది. ఎవరేమనుకున్నా వారిపని వారిదే. దీనివలన సంబంధబాంధవ్యాలు, సమయము కూడా కోల్పోక తప్పదు . రాను రాను మానసిక సమస్యలు మొదలయ్యే అవకాశం ఉంది.

  • =========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.