Friday, March 1, 2013

Is b.p. hereditory?,బి.పి.వంశపారంపర్యమా?


  •  









  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్రశ్న : నా వయసు 42 సంవత్సరాలు. నాకు బిపి 140/90, 135/80 మధ్యలో మారుతోంది. మా నాన్నగారికి బిపి ఉంది. ఆయన మందులు వాడుతున్నారు. నేను కూడా బిపికి మందులు వాడాల్సిన అవసరం ఉందా?

జవాబు : మీకున్న బిపిని హై నార్మల్‌ బిపి అంటారు. అంటే 140/90 దాటలేదు కాబట్టి మీరు తీసుకునే ఆహారంపట్ల జాగ్రత్తగా ఉండాలి. ఉప్పు తగ్గించుకోవాలి.నూనెలు ఉన్న ఆహారము(oily foods) తగ్గించాలి.  బరువు నియంత్రణలో ఉంచుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం ముఖ్యంగా నడక కనీసం అరగంటైనా చేయాలి. ఆహారంలో కాయగూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. దీని వల్ల మీ బిపి నార్మల్‌ స్థితికి వచ్చే అవకాశముంది. మీకు ధూమపానం, మద్యపానం వంటి దురలవాట్లు ఉంటే వెంటనే మానాలి. అప్పటికీ బిపి పెరుగుతుంటే మందులు వాడాల్సి ఉంటుంది. హై నార్మల్‌ బిపి 140/90లోపు ఉంటే మందులు అవసరం ఉండకపోవచ్చు.
  • =========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.