Sunday, December 16, 2012

Tell hints those could push back age some time, వయసు కొంత వెనక్కి మళ్ళినట్లు కనిపించగల సూచనల్ని వివరించండి

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

Q: Tell hints those could push back age some time, వయసు కొంత వెనక్కి మళ్ళినట్లు కనిపించగల సూచనల్ని వివరించండి .

:ఖరీదైన యాంటీ ఏజింగ్ ఉత్పత్తులు యవ్వనవంతమైన చర్మానికి సంబంధించి ప్రధానపాత్ర పోషించినప్పటికీ  మనము చేపట్టాల్సిన చర్యలు కొన్ని ఉంటాయి. అవి ->..

మంచినీళ్ళు : చర్మము చక్కని తేమతో ఉండి శరీరము లోపలి విషతుల్యాలు వెలికి పోవాలంటే రోజుకు కనీసము 5-6 గ్లాసులు (1 లీ.-1.5 లీ) నీరు తాగుతుండాలి . మంచినీళ్ళు , బ్లాక్ లేదా గ్రీన్‌ టీ ఆరోగ్యాన్ని మెరుగు పరిచే ఫ్లేవనాయిడ్స్ ను అందిస్తాయి. బాగా రసాలతో నిండి ఉండే పండ్లు , కూరలు  చర్మము హైడ్రే్షన్‌ ను , డెన్సిటీని పెంచుతాయి.

ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ : సల్మాన్‌ , సార్డిన్స్ , వాల్ నట్స్ , గుడ్లు లలో ఎక్కువగా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్నందున చర్మకణాలకు బాగా మంచిది.

ఎ,సి,ఇ  విటమిన్లు : ఈ మూడు విటమిన్లు చర్మానికి మంచి చేస్తాయి. పాలకూర , క్యారెట్లు , చిలగడదుంపలు , యాప్రికోట్స్ లలో ఉండే యాంటీ ఆక్షిడెంట్స్ త్వరితము గా వార్ధక్యానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్ నుండి చర్మాన్ని రక్షిస్తాయి. కివి , సిట్రస్ పండ్లు , బ్రొకోలి లలో ఉండే విటమిన్‌ ' సి" , కొల్లాజిన్‌ మెరుగుపరిచే గుణము , ఆకుకూరలలో ఉండే విటమిన్‌ " ఇ " సూర్యకిరణాలనుండి చర్మాన్ని రక్షిస్తాయి .

పూరిస్థాయి ధాన్యాలు : వీటిలో లభించే యాంటీ ఏజింగ్  యాంటి ఆక్షిడెంట్లు , పీచు చర్మానికి హానిచేసే చెడు కొలెస్టిరాల్ నుండి , విషపదార్ధాలు (టాక్షిన్‌లు )నుండి కాపాడుతాయి.

సిలికా : ఇది చర్మము లోని తేమను పట్టివుంచి వెలాసిటీ ని మెయిన్‌టైన్‌ చేయడము లో సహకరిస్తుంది .

కెరొటినాయిడ్స్ : ఆకుకూరలు , పండ్లు , క్యారట్  లలో ఉండే కెరొటినాయిడ్స్  చర్మాన్ని ఆరోగ్యవంతం గాను , కాంతివంతం గాను ఉండేందుకు సహకరిస్తాయి.

ఈ విధము గా ఆహార ఆలవాట్లు , వ్యాయామ అలవాట్లు , తగినంత నిద్ర  వయసు తక్కువగా కనబడేందుకు దోహదం చేస్తాయి.

  • ============================

 visit my website - > Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.