Sunday, December 2, 2012

Lumps in Breast-రొమ్ములో గడ్డలు


ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర  : నా భార్య వయసు 40. ఆమెకు రొమ్ములో గడ్డలు వస్తే డాక్టర్లు ఆపరేషన్ చేసి తొలగించారు. అయితే మళ్లీ మళ్లీ రావచ్చని, అవి క్యాన్సర్ గడ్డలుగా మారవచ్చని కూడా అన్నారు. దాంతో మాకు ఆందోళనగా ఉంది. ఇలాంటి గడ్డలు మళ్లీ రాకుండా  మంచి ఔషధాలు సూచించండి.

జ :రొమ్ము లో అన్ని గడ్డలు క్యాన్‌సర్ గడ్డలు కావు . కొన్ని  ఫైబ్రోఎడినోమా అనే బినైన్ ట్యూమర్స్. ఇవి క్యాన్సర్‌లా హానికరమైనవి కావు. మహిళలకు 30 ఏళ్ల వయసులో ఇలాంటి గడ్డలు రొమ్ములో రావడం మామూలే. ఇలాంటివి కనిపించినప్పుడు రెండు నెలలకోసారి అల్ట్రాసౌండ్ లేదా మమ్మోగ్రఫీ వంటి పరీక్షలు చేయించి జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. రుతుక్రమం ఆగిపోయాక ఇలాంటి గడ్డలు రావడం కూడా చాలామందిలో తగ్గిపోతుంది. అయితే ఇలాంటి గడ్డలు వచ్చినప్పుడు... వాటి కారణాలేమిటి, వారి మానసిక పరిస్థితులు, తత్వం వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని మందులు ఇచ్చి, వాటిని పూర్తిగా నయం చేయవచ్చు. గడ్డలు వచ్చే శరీర తత్వం ఉన్నవారికి ఆపరేషన్ చేసినా ఇవి మళ్లీ మళ్లీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి  వైద్యుడికి చూపించాకే మందులు వాడటం మంచిది. 
 Some fibroadenomas respond to treatment with ormeloxifene.
  • ========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.