- ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము --
- మధుమేహము వంశపారంపర్యముగా(Gene mediated) 90 శాతమువరకూ వస్తుంది. ఏమి తిన్నా ... ఏమి తినకపోయినా వంశములో ఉంటే ... డయాబెటిక్ జీన్ గనుక డామినెంట్ అయి ఉంటే ఏదో ఒక వయసులో ... ముందో , వెనకో రాక మానదు. చేపలు తిన్నా ,, మాంసము తిన్నా దాని ఉదృతము(leval) లో కొద్ది గా తేడా తప్పితే తగ్గిపోవడము అంటూ , రాకపోవడం అంటూ జరుగదు.
మాంసం బదులు.. చేపలు.. చేప తింటే చక్కెర వ్యాధికి చెక్ చెప్పినట్లే. రోజూ ఫిష్ తినేవారికి షుగర్ వ్యాధి రానే రాదట. రోజూ చేపలు తినడం వల్ల డయాబెటీస్‌ను దూరంగా ఉంచవచ్చని... లండన్‌లోని వలెన్సియా యూనివర్సిటీ నిపుణులు పరిశోధించి తేల్చారు. 55 నుంచి 80 ఏళ్ల మధ్య ఉన్న 945 మందిపై జరిపిన పరిశోధనలో ఈ విషయాన్ని గుర్తించారు... చేపలు తిన్నవారిలో డయాబెటీస్ సాధారణ స్థితిలో ఉన్నట్లు కనిపెట్టారు. అదే సమయంలో మాంసం తిన్న వారిలో షుగర్ లెవల్స్ ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు నిర్ధారించారు... చేపలు తినడం వల్ల డయాబెటీస్‌ను కంట్రోల్ చేస్తున్నట్లు గుర్తించారు... చేపల వల్ల గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుందని వలెన్సియా యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. చేప తినండి.. చక్కెర వ్యాధికి దూరం కండి.
- .=============================
visit my website - > Dr.Seshagirirao-MBBS



No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.