Wednesday, September 19, 2012

A.V.fistula operation-ఎవి ఫిస్ట్యులా ఆపరేషన్‌



  • ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము


Q ; నా వయసు 48 సంత్సరాలు. నేను క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌ అనే వ్యాధితో బాధపడుతున్నాను. క్రియాటినిన్‌ 6.4 , యూరియా 204 ఎంజి/డిఎల్‌ ఉంది. నాకు ఏ విధమైన ఇబ్బందులు లేవు. డాక్టర్‌గారు ఎవి ఫిస్ట్యులా ఆపరేషన్‌ చేయించుకోవాలని సూచించారు. ఏ లక్షణాలు లేకున్నా ఈ ఆపరేషన్‌ చేయించుకోవడం అవసరమా? సలహా ఇవ్వగలరు. దిలీప్‌ కుమార్‌, హైదరాబాద్‌.

A : మీరు క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌ నాలుగో దశలో ఉన్నారు. ఇప్పుడు ఏ లక్షణాలు లేనప్పటికీ మీకు భవిష్యత్తులో డయాలసిస్‌ అవసరమవుతుంది. డయాలసిస్‌ అంటే నిమిషానికి 200 మిల్లీలీటర్ల రక్తం బయటికి పంపించి కృత్రిమ కిడ్నీ ద్వారా ఫిల్టర్‌ చేసి మళ్లీ లోపలికి పంపిస్తారు. చేతిపైన ఉండే రక్తనాళాల్లో ఇంత రక్తం రాదు. ఎవిఫిస్టుల్యా అంటే లోపలి పెద్ద రక్తనాళంపైన ఉండే చిన్న రక్తనాళానికి కలపడం ద్వారా పైన ఉండే చిన్న రక్తనాళంలో రక్తప్రవాహాన్ని పెంచుకోవడం. ఈ ఆపరేషన్‌ చేసిన తర్వాత నెల నుండి రెండు నెలల తర్వాత చిన్న రక్తనాళాల్లో రక్తప్రవాహం పెరుగుతుంది. అప్పుడు ఈ రక్తాన్ని డయాలసిస్‌కు ఉపయోగించుకోవచ్చు. ఇది ముందే చేయించుకోవడం ద్వారా హాస్పిటల్‌లో చేరకుండానే అవుట్‌ పేషెంట్‌గానే చేరి డయాలసిస్‌ చేయించుకోవచ్చు. చాలా ఖర్చు తగ్గుతుంది. ఎమర్జెన్సీ డయాలసిస్‌ కోసం వాడే క్యాథటర్‌ వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్లు, ఇతర సమస్యలను నివారించొచ్చు. అందుకని ఎవి ఫిస్ట్యులా ఆపరేషన్‌ చేయించుకోవడం మంచిది.

-డాక్టర్‌ శ్రీధర్‌,కన్సల్టెంట్‌ నెఫ్రాలజిస్ట్‌.
  • .=================================

visit my website - > Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.