Tuesday, March 15, 2011

నాకు జలుబు చేసింది . సరియైన చికిత్స చెప్పగలరా?,I am suffering from common cold Treatment please?



ప్ర : నాకు జలుబు చేసింది . సరియైన చికిత్స చెప్పగలరా?--- కోమటి శశిభూషం రావు . ఇప్పిలి .

జ : వాతావరణం మారినప్పుడు జలుబు చేస్తుంది. ఇది ఎక్కువగా చిన్న పిల్లలకు సంక్రమిస్తుంది. (also known as nasopharyngitis, rhinopharyngitis, acute coryza, head cold, or simply a cold) జలుబు చేసినప్పుడు గొంతు పొడిగానూ, నసగానూ ముక్కు బిగదీసినట్లుగాను ఉంటుంది. ముక్కు వెంట నీరు కారటం, వెంటవెంటనే తుమ్ములు రావటం జరుగుతుంది.జలుబు వచ్చిన వ్యక్తి దగ్గినా, తుమ్మినా సమీపంలో ఉన్న వ్యక్తిలోకి ఈ వైరస్ క్రిములు ప్రవేశిస్తాయి. ఫలితంగా వారికి కూడా జలుబు సంక్రమిస్తుంది.
The common cold is a viral infection of the upper respiratory tract. The most commonly implicated virus is a rhinovirus (30–80%), a type of picornavirus with 99 known serotypes. Others include: human coronavirus (~15%), influenza viruses (10-15%), adenoviruses (5%), human parainfluenza viruses, human respiratory syncytial virus, enteroviruses other than rhinoviruses, and metapneumovirus. Frequently more than one virus is present. In total over 200 different viral types are associated with colds.

జలుబు తగ్గటానికి సరియైన యాంటివైరల్  మందు అందుబాటులో లేదు. ఏ మందు వాడినప్పటికీ ఉపశమనం తప్ప పూర్తిగా తగ్గించలేవు. ఎందువలన అంటే జలుబు కలుగనేసే వైరస్ లు చాలా రకాలు , అందులోన ఈ వైరస్ లు వాతావరణ పరిస్థితుల బట్టి రూపాంతము చెందుతూ ఉంటాయి.    దీనికి కావలసినంత విశ్రాంతి తీసుకుంటే శరీరమే దీనిని నిరోధించగలదని వైద్యులు చెబుతున్నారు.

ఉపశమనం కోసం మందులు :
జ్వరానికి + పడిశం కోసం : Sucet Plus tablets రోజుకి రెండు లేదా మూడు మాత్రలు --- 3-4 రోజులు ,
దగ్గుకి : Delitus-D సిరఫ్ 5 మి.లీ. చొప్పున్న రోజుకి 3 సార్లు ,
ఇన్ఫెక్షన్‌ ఉంటే -- యాంటి బయోటిక్స్ ఉదా: Azithromycin 250/500 m.g . రోజుకి వయసును బట్టి 2-3 మాత్రలు ...3-5 రోజులు వాడాలి ,


  • ===========================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.