Tuesday, December 28, 2010

Thyroid problem conception, థైరాయిడ్ సమస్య పిల్లలు పుట్టడం

Q : నా వయసు 26. పెళ్లై నాలుగేళ్లు అవుతోంది. పిల్లలు కలగడం లేదని టెస్టులు చేయించుకుంటే థైరాయిడ్ సమస్య ఉన్నట్టు పోయిన ఏడాది తెలిసింది. అప్పటి నుంచి మందులు వాడుతున్నాను. దాంతో సమస్య అదుపులోనే ఉంది. కాని ఇప్పటి వరకు ప్రెగ్నెన్సీ రాలేదు. అయితే నాలుగు నెలల నుంచి పీరియడ్స్ రాకపోవడంతో డాక్టర్ని సంప్రదించాను. థైరాయిడ్ సమస్య ఉన్నవారిలో ఈ సమస్య సాధారణమే అన్నారు. పిల్లలు పుట్టేందుకు థైరాయిడ్ సమస్య అవుతుందా? నాకు పిల్లలు కలిగే యోగం ఉందా? దయచేసి చెప్పగలరు.



A : థైరాయిడ్ హార్మోన్ మన శరీరంలో చాలా భాగాల పెరుగుదలపై, వాటి పనితీరుపై ప్రభావాన్ని చూపుతుంది. వీటిలో ఫెర్టిలిటీ, రీ-ప్రొడక్షన్ ముఖ్యమైనవి. థైరాయిడ్ హార్మోన్ లెవల్స్ వయసును బట్టి, శారీరక స్థితిని బట్టి మారతాయి. టాబ్లెట్లు వాడుతున్నప్పుడు నెలసరి సరిగ్గా ఉందన్నారు కాబట్టి థైరాయిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించండి. అది మామూలుగా ఉన్నట్లయితే పీరియడ్స్ నాలుగు నెలల పాటు రాకపోవడానికి ఇతర కారణాలు వెతకవలసి ఉంటుంది. ఒకవేళ థైరాయిడ్ హార్మోన్ లెవల్స్ మామూలుగా లేకపోతే, వాటి స్థాయులను బట్టి మందులు వాడాలి. దీంతో పీరియడ్స్ సక్రమంగా వచ్చేందుకు అవకాశం ఉంది. థైరాయిడ్ లెవల్ మామూలుగా ఉండి, పీరియడ్స్ సాధారణంగా ఉన్నట్లయితే పిల్లలు పుట్టడంలో ఎలాంటి ఆటంకాలు ఉండవు. కాని ప్రెగ్నెన్సీ సమయంలో కూడా ఈ హార్మోన్ టాబ్లెట్లు వాడాలి. తరచుగా థైరాయిడ్ లెవల్స్‌ని టెస్ట్ చేయించుకోవాలి. బిడ్డకి కూడా పుట్టిన కొద్ది రోజులకే థైరాయిడ్ టెస్ట్ చేయించాల్సి ఉంటుంది.


  • =======================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.