Sunday, April 6, 2014

Sun rays necessary for health?, ఆరోగ్యానికి సూర్యకాంతి అవసరమా?

  •  


  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : మంచి ఆరోగ్యానికి సూర్యకాంతి అవసరమా?

జ : మనిషి ఆరోగ్యానికి సూర్యకాంతి అవసరమే . ఎండతాకితే ఎక్కడ కమిలి పోతామోనన్న భయముతో సూర్యకిరణాలు తగలకుండా ఏదో ఒకటి అడ్డువేసుకుంటుంటాము .సూర్యకిరణాల తాకిడికి చర్మము కందిపోతుందన్న ఆలోచనలో పడి , రోజూ శరీరానికి కొద్దిపాటి ఎండ సోకడం అవసరమన్న సంగతినే పూర్తిగా విస్మరించేస్తున్నాము . మన దేశములో అత్యధిక సంఖ్యలో విటమిన్‌ డి లోపము తో ఉన్నారు. విదేశాలలో " సన్‌ బాతింగ్ " సంస్కృతి ఉంది. కాని మనం మాత్రం సూర్యుడి తీక్షణత అంటే భయపడిపోతున్నాము. ప్రతిరోజూ 15 -20 నిముషాలు సూర్యునికి ఎక్ష్పోజ్ అవడము చాలా ముఖ్యము . సూర్యకిరణాలనుండి శరీరానికి అవసరమైన విటమిన్‌ ' డి ' ని సమకూర్చుకుంటుంది.

సూర్యకాంతి సోకడము వల్ల ఎముక పటిష్టత మెరుగుపడుతుంది. ముఖ్యముగా పట్టణాలలో నివసించే భారతీయులు అసలు ఎండలోకి వెళ్ళడానికి ఇష్టపడరు . సూర్యరశ్మి సోకితే ట్యాన్‌ వస్తుందన్న భయము ఉన్నవారు ' సన్‌ స్క్రీన్‌ ' అప్లై చేసుకోవచ్చు . అయితే ఎండ తగిలే వేళల విషయములో జాగ్రత్తగా ఉండాలి . ఇది చాలా ముఖ్యము కూడా. ఉదయము 10 గం. నుండి మద్యాహ్నము 2 గం.ల వరకూ సూర్యుని అతినీలలోహిత కిరిణాలు తీక్షణము ఎక్కువగా ఉంటుంది. . కాబట్టి ఆ సమయాలలో చర్మానికి హాని జరుగుతుంది. ఉదయం 10 గం.ల లోపు , మధ్యాహ్నము 2 గం.ల తరువాత ఎండలోకి వెళ్ళి కనీషము పావుగంట  సేపైనా సూర్యకాంతి శరీరానికి  తగలినివ్వాలి .

 దీనివల్ల
  • -- ఎముకల ఆరోగ్యము బాగుంటుంది. 
  • -- నిద్ర క్వాలిటీ పెరుగుతుంది . 
  • -- జీర్ణశక్తి మెరుగవుతుంది. 
  • -- జీవక్రియ బాగుంటుంది. 
  • -- రోగనిరోధక శక్తి పటిస్టముగా ఉంటుంది. 
  • -- రక్టపోటు తగ్గుతుంది. 
  • -- డిప్రషన్‌ వంటి మానసిక రుగ్మతలు తగ్గుతాయి. 

  • ===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.