Sunday, February 19, 2012

ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి? , Whydo we get hiccoughs?




ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
ప్ర : మా అబ్బాయికి భోజనము చేస్తున్నపుడు తరచుగా ఎక్కిళ్లు వస్తుంటాయి. ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి? తగ్గాలంటే ఏమి చేయాలి?

జ : -ఎక్కిళ్లను నిత్యజీవితం లో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఎదుర్కొం టారు. ఎక్కిళ్లు డయాఫ్రం కదలిక వల్ల వస్తాయి. ఛాతీ కిందుగా కడుపు పై భాగాన ఉండే వర్తులాకార పొరను డయాఫ్రం అంటారు. ఇది శ్వాసక్రియను నిర్వర్తించే సమయంలోనూ, ఆహారం తీసుకునేటప్పుడు అటూ, ఇటూ కదలి శరీరంలోని ఒత్తిడిని సమతూకంగా ఉండేట్లు చేస్తుంది. దీన్ని నియంత్రించడానికి మెదడులో ప్రత్యేక కేంద్రం ఉంటుంది. దీని నుండి బయలు దేరిన 'ఫ్రెనిక్‌ నాడి డయాఫ్రం వరకు ఉంటుంది. డయాఫ్రం ఊపిరి పీల్చినప్పుడు ముడుచుకుని ఉంటుంది. ఊపిరి వదలగానే మళ్లీ మామూలుగా ఉంటుంది. ఈ ప్రక్రియ ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. దీనితో శ్వాసక్రియ కూడా సక్రమంగా జరుగుతుంది. ఏ కారణం చేతనైనా ఫ్రెనిక్‌ నాడి గానీ, డయాఫ్రం గానీ ఒక క్రమ పద్ధతిలో అన్వయించుకోకపోవడం వల్ల చర్యాక్రమం తప్పుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో డయాప్రం ఒక్కసారిగా సంకోచించడము వలన ... గాలి పీల్చుకుంటే స్వరపేటిక హఠాత్తుగా మూసుకుంటుంది. దీనితో 'హిక్‌ అనే చప్పుడు వస్తుంది. డయాఫ్రం సక్రమంగా పనిచేసేదాకా ఈ విధంగా శబ్దం వస్తూనే ఉంటుంది. దీనినే ఎక్కిళ్లు అంటారు.

కారణాలు :
  • గాబరా గా ఆహారము తినడము వలన సాధారణము గా ఎక్కిళ్ళు వస్తాయి. నీరు తాగితే తగ్గిపోతాయి ,
  • ఒక్కొక్కసారి కొన్ని ప్రత్యేక పరిస్థితులు అంటే మూత్రపిండాలు, గుండె, కాలేయం వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధుల వల్ల కూడా ఎక్కిళ్లు వస్తాయి.
  • కొన్ని సందర్భాల్లో మెదడు సంబంధమైన వ్యాధుల వల్ల,
  • విష పదార్థాల సేవనం వల్ల,
  • శరీరానికి సరిపడని ఆహార పదార్థాల వల్ల,
  • కడుపు ఉబ్బరం, గ్యాస్‌ వంటి వాటి వల్ల కూడా ఎక్కిళ్లు వస్తాయి.
  • ఆదుర్థా, భయం, దు:ఖం వంటి మానసిక కారణాల వల్ల కూడా ఎక్కిళ్లు రావచ్చు.
  • ఎక్కువ మసాలా పదార్ధాలు ఉన్న ఆహారము తినడం వల్ల ,
  • కారము ఎక్కువగా ఉన్న ఆహారము భుజించడం వలన ,
  • సుగరు వ్యాధి ముదినపుడు ,
  • ఎక్కువగా మందు (సారా) త్రాగడం వల్న ,
  • ఎక్కువగ పొగ త్రాగడం వలన ,
  • నోటి పూత తో బాధపదుతున్నా,
  • ఉదరకోశ క్యాన్సర్ ఉన్నపుడు ,
  • కామెర్ల జబ్బు తో బాదపడుతున్నపుడు ,
  • తీవ్రమైన ఎలర్జీ వ్యాధులు లతో బాధపడుతున్నపుడు ,
  • తీవ్రమైన అజీర్ణవ్యాదులతో బాదపడుతున్నపుడు ,
  • అంటే నిజానికి ఎక్కిళ్లు అనేవి జబ్బు కాదు. ఎక్కిళ్లు దీర్ఘకాలంగా ఉన్నా ప్రమాదం లేదు. అయితే ఇబ్బందిగా, విసుగ్గా ఉంటుంది.


ఆయుర్వేధిక చిట్కాలు :
  • పంచదారను లేదా ఏదైనా స్వీట్‌ను తింటే ఎక్కిళ్లు తగ్గుతాయి.
  • క్కోసారి మంచినీళ్లు తాగినా ఎక్కిళ్లు తగ్గిపోతాయి.
  • పచ్చి తాటాకు నమిలి ఊటను మింగుతే ఎక్కిళ్లు పోతాయి.దయం,
  • సాయంత్రం రెండు పూటలా పల్లేరు కాయలు లేక చెట్టు కాడ రసాన్ని కొద్దిగా తేనెను కలిపి తీసుకుంటే ఎక్కిళ్లు తగ్గిపోతాయి.
  • నేల ఉసిరి ఆకుల్ని నమిలి మింగటం వల్ల కూడా ఎక్కిళ్లు తగ్గుతాయి.
  • మామిడి ఆకుల్ని ఎండబెట్టి వాటిని కాల్చి వచ్చే పొగను పీల్చినా ఎక్కిల్లు ఆగుతాయి.
  • తాటికాయను చిన్నగాటు పెట్టగా వచ్చిన నీరు లాంటి ద్రవాన్ని అరకప్పు తాగినా వెక్కిళ్లు తగ్గుతాయి.
  • రాతి ఉసిరికాయలు తింటుంటే ఎక్కిళ్లు తగ్గుతాయి.ప్రతిరోజూ వీటి రసం తాగినా ఎక్కిళ్లు పోతాయి.
  • కొబ్బరి బోండాం నీళ్లు తాగితే ఎక్కిళ్లు తగ్గుతాయి.
  • బఠాణీ గింజంత ఇంగువను గోరువెచ్చని నీళ్లలో వేసుకుని మింగితే ఎక్కిళ్లు తగ్గుతాయి.
  • కొబ్బరిని చితక్కొట్టి ఆ పిప్పిని బాగా పిండితే పాల వంటి పదార్థం వస్తుంది. దీనిని తాగినా, నిమ్మరసం తాగినా ఎక్కిళ్లు తగ్గుతాయి.
  • నాలుకకు తరుచుగా తేనె రాస్తున్నా ఎక్కిళ్లు తగ్గుతాయి.
  • జామకాయను తిన్నా ఎక్కిళ్లు తగ్గుతాయి.
  • శొంఠి లేదా కరక్కార పైపెచ్చు చూర్ణం అరచెంచాడు తీసుకున చెంచాడు తేనెను కలిపి చప్పరిస్తే ఎక్కిళ్లు తగ్గుతాయి.
  • శొంఠి, ఉసిరిక పలుకు, పిప్పళ్లు వీటన్నింటిని సమభాగాలుగా తీసుకుని కలిపి చూర్ణం చేసి పూటకు పావు చెంచాడు వంతున రోజూ రెండు పూటలా తింటే ఎక్కిళ్లు పోతాయి.
  • విటమిన్‌ ఉన్న పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినడం వల్ల కూడా ఎక్కిళ్లను నియంత్రించవచ్చు.
  • వేపాకు పొడి, ఉసిరిక పొడిని సమాన మెతాదులో తీసుకుంటే ఎక్కిళ్లు తగ్గుతాయి.
  • ఎక్కిళ్లు వస్తున్న వ్యక్తి దృష్టి మళ్లించడానికి ఏదైనా ఆశ్చర్యకమైన వార్తను చెప్పాలి. దీంతో వెంటనే ఎక్కిళ్లు ఆగిపోతాయి.
  • ఆవాలను పొంగబెట్టి తాగిస్తే వెంటనే ఎక్కిళ్లు తగ్గుతాయి.
అల్లోపతిక్ చికిత్స :
Tab . backfen (antispasmodic) 1 tab 3 times /day for 3-4 days ,
Tab . Aceloc Rd (anti acidic) 1 tab 3 times /day for 3-4 days

=================================================


visit my website - > Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.