Saturday, February 20, 2010

పాదాల పగుళ్ళు , Foot cracks




ప్ర : నా వయస్సు 32 సం.లు ... పాదాల పగుళ్ళు తగ్గడము లేదు . శీతాకాలం లో మరీ అసహ్యము గా కనిపిస్తున్నాయి . వీటినెలా తగ్గించుకోవాలి ? .

జ : శీతాకాలం లో పగుల్ల బాధ ఎక్కువే .. కొద్దిపాటి ప్రయత్నం తో ఈ సమస్యను సులువుగా నివారించుకోవచ్చును . సాలిసిలిక్ యాసిడ్ గల క్రీము ను (Dipsalic)ను పడుకునే ముందు పాదాలకు రాయండి . రాసినతరువాట క్లింగ్ ఫిలిం లేదా ప్లాస్టిక్ బ్యాగ్ చుట్టండి ... దీనివల్ల క్రీమ్ దుప్పట్లకు అంటకుండా ఉంటుంది. సాలిసిలిక్ యాసిడ్ పాదాలను మృదువుగా ఉంచడమే కాకుండా చర్మం పై మ్రుతకనాల్ని తొలగిస్తుంది .
ఇలా క్రీమ్ 6-7 రోజులు రాశాక గోరు వెచ్చని నీటిలో పాదాల్ని అరగంట ఉంచి ప్యూమిక్ స్టోన్ తో మృదువుగా రుద్దాలి ... రుద్దడం వల్ల మ్రుతకనాలు రాలిపోతాయి . ఇలా కనీసము రెండు మాసాల పాటు చేస్తూ ఉండాలి . పగటి పుట ఏదైనా మాయిస్చరైజర్ క్రీమ్ ను రాస్తూ ఉండాలి . ఇంట్లో సైతము ఒట్టి పాదాలతో నడవకూడదు .. రబ్బరు (హవాయి) చెప్పులు వేసుకోవాలి .


తరచూ కాళ్లపగుళ్లు బాధిస్తున్నాయంటే.. క్యాల్షియం లోపం కావచ్చు. అలాగే జింక్‌, క్యాల్షియం లోపం వల్ల కాలిగోళ్లు కూడా పొడిబారతాయి. కాళ్లపగుళ్లను నివారించేందుకు ఈ రోజుల్లో రకరకాల ఫుట్‌క్రీంలు అందుబాటులో ఉన్నాయి. కాస్త నాణ్యమైనదాన్ని ఎంచుకొంటే సరిపోతుంది. అలాగే రాత్రిళ్లు ఆముదంలో చిటికెడు పసుపు వేసి అరిపాదాలకు రాసి.. బాగా మర్దన చేసుకుని సాక్సులు ధరించినా కూడా చాలా మార్పు కనిపిస్తుంది. ఇంట్లో తిరిగేటప్పుడు పాదరక్షలు తప్పనిసరి. గోళ్ల విషయానికొస్తే.. బాదం, ఆలివ్‌నూనె, ఆముదం.. ఇలా ఓ నూనెను తీసుకుని ప్రతి గోరుపై నిమిషం సేపు మర్దన చేయాలి. రక్తప్రసరణ వేగవంతమై గోళ్లు ఆరోగ్యంగా పెరుగుతాయి. అలాగే విరిగిపోయిన గోళ్లకు ఎప్పటికప్పుడు తీసేయాలి. లేదంటే.. అవి ఇంకా విరిగిపోతాయి. సాధ్యమైనంతవరకు లేత చాయల్లో ఉండే నాణ్యమైన గోళ్లరంగును ఎంచుకోవడం వల్ల ఎంతో మార్పు ఉంటుంది. ఈ కాలమంతా పాదాలకు మాయిశ్చరైజర్‌ను రాసుకున్నా కూడా ఎంతో మార్పు ఉంటుంది. నెలకు కనీసం రెండుసార్లు పెడిక్యూర్‌ చేయించుకోవడాన్ని ఓ అలవాటుగా పెట్టుకోవాలి. (ఈనాడు వసుందర)
  • ===============================================

visit my website - > Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.