Sunday, September 6, 2009

గర్భిణీ గా ఉన్నప్పుడు రక్తస్రావము , Bleeding during pregnancy


ప్ర : నాకిప్పుడు ఎనిమిదో నెల . అనుకోకుండా వివరీతం గా రక్తస్రావము అయింది .వెంటనే వైద్యుని సంప్రదిస్తే స్కానింగ్ తీసి బిడ్డ బాగానే ఉన్నది కాని బిడ్డకు గర్భసంచి కి మధ్యలో రక్తం గడ్డ ఉందన్నారు . ఏదైనా ప్రమాదమా ?
- సోదరి ..విమల .
జ : గర్బము ధరించి ఉన్నపుడు సదరణము గా రక్తస్రావము జరుగదు . కొంతమందికి ప్రతినెల కొంచం ఎరికిల బ్లీడింగ్ కనబడుతుంది ... ఇది హార్మోనుల అసమతుల్యము వలన జరుగు తుంది . . దీనివల ప్రమాదమేమీ లేదు కాని తల్లి మానసికం గా ఆందోళన చెందే అవకాసము ఉండవచ్చును . ప్రతి నెల ప్రోజేస్తిరాన్ ఇంజెక్షన్ తీసుకోవాలి . ఉదా : inj. Anin 500 mg , or "proluton depot 500 mg , or "Maintane 500 mg " డాక్టర్ సలహా తో వాడాలి.
ఇతర ప్రమాదకర కారణాలు :
Placenta previa > ఇది చాల ప్రదకరమైనది . మాయ బిడ్డ తల కింద సేర్విక్ష్ ను ముసి ఉంటుంది .. బిడ్డ కదలికలు వల్ల రక్తస్రావము జరుగుతుంది , కడుపు నొప్పి ఉండదు . ఎలాంటి పనులు చేయకుండా పూర్తీ విశ్రాంతి తీసుకోవాలి .
వైద్యులు సూచించిన ముందులు వాడాలి . తొమ్మిది నెలలు ముందు గానే రెండోసారి మళ్ళీ రక్తస్రావము అయితే తల్లి ప్రాణాలకే ముప్పు కావున ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయాల్సి ఉంటుంది .

placenta Ecreta > ఇక్కడ మాయ సేర్విక్షు ఒక ప్రక్క భాగాన ఉంటుంది . అంతగా ప్రమాదకరము కాకపోయినా వైద్యు సూచించిన మందులు వాడాలి . రక్తస్రావము మరీ ఎక్కువైతే సీజర్ ఆపరేషన్ 37 వారాల గర్భిణి నిండిన
తరువాత చేసి బిడ్డను బయటకు తీయడం మంచిది .



Accidental hemorrhage > గర్భిణీ గా ఉన్నప్పుడు రక్తస్రావము తో కడుపు నొప్పి కుడా వస్తే ..
పరిస్థితి ని " యాక్షి డెంటల్ " హేమరేజ్ అంటాము . భయపడకుండా ... పూర్తీ విశ్రాంతి తీసుకొని , మందులు వాడితే తొమ్మిది నెలదాకా కొనసాగించవచ్చును .

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.