ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
ప్ర : ప్రోటీన్ షేక్స్ తీసుకోవడము వల్ల బరువు శీఘ్రము గా తగ్గుతామా?
జ : మామూలు భోజనము స్థానే ప్రోటీం షేక్స్ తీసుకోవడము వలన క్యాలరీల సంఖ్య తగ్గవచ్చు .. కానీ దానివలన శరీరానికి అందాల్సిన అత్యవసర పోషకాలు అందవు . ఈ పోషకాలు పూర్తిస్థాయి ఆహారములొనే లభిస్తాయి. పోటీన్ల లో సైతం కేలరీలు ఉంటాయి. అతిగా తరచుగా తింటే లాభమేమీ ఉండదు. అది ఆరోగ్యవంతమైన మార్గము కాదు . తప్పనిసరిగా ఆరోగ్యవంతమైన సమతుల్య ఆహారము పరిమితము గా తింటూ తగిన వ్యాయామము చేయాలి తప్ప బరువు తగ్గాలకుంటే పోటీన్ షేక్స్ ప్రత్యామ్నాయాలు కావు.
- ===========================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.