Monday, December 24, 2012

Solution for Snoring during sleep?,నిద్రపోయేటప్పుడు బాగా గురక పెడతాను పరిష్కారము?

  •  
  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : నా వయసు 40 సంవత్సరాలు . డయాబిటీస్ , బి.పి. ఉనాయి. నిద్రపోయేటప్పుడు బాగా గురక పెడతాను . నా బరువు 128 కె.జి.లు  నా సమస్యకు పరిష్కారము ఉండా?

జ :  అసలు గురక ఎందుకు వస్తుంది...?  సాధారణంగా నిద్రించే సమయంలో ముక్కుతో గాలి పీలుస్తుంటాం. ఇలా ముక్కుతో గాలి పీల్చడంలో ఇబ్బంది ఎదురైతే మనకు తెలియకుండానే నోటి ద్వారా శ్వాసిస్తుంటాం. ఇలాంటి సందర్భంలో శ్వాసకోసం సంకోచ వ్యాకోచాలకు గురై నాలుక, అంగిటను నియంత్రించే కండరాల నియంత్రణ విఫలం అయినప్పుడు వచ్చే శబ్దమే గురక.

మీరు స్థూలకాయము అనే సమయతో మరియు తత్సంబంధిత కో-మార్బిడిటీస్ తో బాధపదుతున్నారు. మొదట స్థూలకాయము తగ్గే మార్గాలు చూడండి .ఈ క్రింది  లింక్ లో చూడవచ్చును .

Obesity : http://vydyaratnakaram.blogspot.in/2009/12/obesity.html 

అవసరమనుకుంటే బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోండి . మీ సమస్యకు పరిష్కారము లభిస్తుంది .
 ============================
visit my website - > Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.