ప్ర : మా ఇద్దరమ్మాయిల నడుమ వ్యత్యాసము 12 సంవత్సరాలు . పెద్దమ్మాయి తనకంత చిన్న చెల్లెలు ఉందని తన ఫ్రండ్స్ కు చెప్పడానికి సిగ్గుపడుతుంటుంది . ఇంట్లో చెల్లెలి తో ప్రేమగా నే ఉంటుంది . కాని స్నేహితులముందే అదో రకము గా ఉంటుంది . ఏమి చేయాలి?.
జ : ముందుగా ఇద్దరమ్మాయిల మధ్య మంచి బాంధవ్యాన్ని ఏర్పరచడము అవసరము . ఇద్దరూ ఇంటి బయట ఎక్కువసేపు గడిపేలా చూడాలి. ఇద్దరూ కబుర్లు చెప్పు కోవడము చేస్తూఉంటే వారి మధ్య బాంధవ్యము దృఢమవుతుంది. పెద్దవాళ్ళలో కొంత అధికారిక ప్రవర్తన సహజమే. పైగా వయసు వ్యత్యాసము ఎక్కువ కాబట్టి ఇది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రకము ధోరణి వల్ల చిన్నపాప ఏవిధముగా ప్రభావితము అవుతుందనేది ముఖ్యము . ఇంట్లో మీరు లేని సమయము లో చిన్న పాప బాధ్యతలు పెద్దపాపకు అప్పగించి చూడండి. దీనివల్ల ఆమెలో బాధ్యత పెరుగుతుంది . నెమ్మది నెమ్మదిగా ఇలా రకరకాలు గా ఆమె ధోరణి మానేలా చేయాలే తప్ప చీదరించుకోకూడదు , దండించరాదు . . . ఒక్క రోజులో మార్చేయాలని ప్రయత్నించకండి.
- ==============================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.