ప్ర : ఈ రోజుల్లో నిద్రలేమి అన్న మాట ఎక్కువగా వినిపిస్తున్నదెందుకు?
జ : నిద్రలేమి అన్నది ఓ వ్యాధి కాదు . నిద్రపట్టడము లేదనుకుంటూ వైద్యుని దగ్గరకు వెళ్ళడము అర్ధరహితము . ఎందుకంటే ఆ లోపము మన జీవనవిధానము లో దాగిఉంటుంది. పురుషుడి శరీరము రోజుకు కనీసము 8 గంటల హార్డ్ వర్క్ కు అనుగుణము గా ఉంటుంది. అంతపనిచేశాక నిజానికి నిద్ర హాయిగా పట్టలి... కాని నేటి జీవన విధానములో ధనాన్ని బాగా సంపాదించగలుగుతున్నారు కాని నిద్రను పొందలేకపోతున్నారు. అందుకే శతాబ్దాలుగా ఓ సామెత ఉన్నది. " చక్రవర్తులకంటే యాచకులే ఎక్కువగా నిద్రపోగలరు " అని .
మనస్సుకు ఎంత పని పెట్టినా శరీరానికి చాలినంత చురుకుదనము ఉండాలి . శరీరానికి అవసరమైన సహజ కోర్సు లేకపోవడము వల్లే నిద్ర రాకపోవడమనేది ఓ సమస్యగా పరిణమిస్తుంది. ఏదో అనారోగ్యమో , మందులవల్లో నిద్రలేమి అనేది కొందరి వీషయములోనే ఉంటుంది తప్ప అన్నీ బావుండీనిద్రరావడములేదంటే లోపము శరీరములో కాదు మనస్సులో ఉన్నట్లు లెక్క . గంటలు కొద్దీ కంప్యూటర్ల ముందో, టివి ల ముందో , ఏ ఫైల్స్ లోనో తలదూర్చి పనిచేసుకునేవారు నిద్ర రావడము లేదనుకోవడము పొరపాటు .. ఆ పని నిద్రకు సహకరించేదో ? కాదో? విశ్లేషించుకోవాలి. మన మెదదులో బయలాజికల్ క్లాక్ ఉంటుంది. ప్రతిరోజూ ఒకే వేలకు నిద్రకు ఉపక్రమించాలి. ఒకే వేళకు నిద్రలేవాలి. రాత్రులు పని ఎక్కువగా ఉన్నవారు, ఆలస్యముగా నిద్రపోయే వారు పగలు ఆ లోటు తీర్చుకోవాలి. పగలు నిద్ర పోవాలి. ఆ విధము గా మొత్తము 8 గంటలు నిద్ర పోయేట్లు చూసుకోవాలి. అంతకీ నిద్ర రావడము లేకపోతే డాక్టర్ ని కలిసి తగిన సలహా తీసుకోవాలి.
- ==============
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.