ప్ర : నాకు వ్యాపారము ఉంది . పార్టీలలో మందు తీసుకోవడము తప్పదు . కొలెస్టిరాల్ ఉందని డాక్టర్ చెప్పారు.ఏమి చేయమంటారు ?
జ : ఏ వృత్తి అయినా మందు తాగడము ఆరోగ్యానికి మంచిది కాదు . ఇంతకాలము ఎంజాయ్ చేసారుగా .. ఇక వయసు పెరిగే కొద్ది మనిషి కి వచ్చే వ్యాదులను(బి.పి, సుగరు, గుండె జబ్బులు ) దృష్టిలో ఉంచుకొని మందు తాగడము మానెయ్యాలి . అప్పటికీ తప్పదు అంటే 10-15 రోజులకొక సారి 2 లేదా 3 పెగ్గుల కంటే ఎక్కువ తీసుకోకూడదు . అలాగే ఆహారములో పంచదార , పంచదార కలిసిన పానీయాలు , చాక్లేట్లు , ఎక్కువ తేనె , జామ్ ,జున్ను, వెన్న , నూనె వేపుడు కూరలు , వేయించిన జీడిపప్పు, వేరుశనగ పప్పు తినకుండా జాగ్రత్త పడాలి . మొత్తము మీద కొలెస్టిరాల్ ను ఎక్కువ చేసే పదార్ధాలు తినకూడదు .
- ================================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.