- ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
ప్ర : సెక్ష్ లో పాల్గొన్న ప్రతిసారి ఉదరభాగము కింద గుచ్చుకున్నట్లుగా నొప్పి వస్తోంది . సిస్ట్ ఉంటే ఇలా జరుగుతుందా? (ఒక సోదరి)
జ : పొత్తికడుపులో నొప్పిరావడానికి చాలా కారణాలు ఉంటాయీ. సిస్ట్స్ కావచ్చును. ఎండోమెట్రియాసిస్ , ఇతర గైనకాలజికల్ పరిస్థితులు కావచ్చు . స్థానికము గా ఇన్‌ఫెక్షన్ ఉన్నా నొప్పి ఉంటుంది. కామన్ గా యూనరీ ట్రాక్ ఇన్‌ఫెక్షన్ ఉన్న వారికి ఈ విధము గా నొప్పి ఉంటుంది. కొంతమందికి హెర్పీస్ ఇన్‌ఫెక్షన్ ఉన్నా గుచ్చుకున్నట్లు నొప్పి రావచ్చును. ఏది ఏమైనా లేడీ డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి . లేకపోతే సెక్ష్ జీవితము బాధాకరముగా ఉండును . నరకమే .
- ============================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.