Q: Tell hints those could push back age some time, వయసు కొంత వెనక్కి మళ్ళినట్లు కనిపించగల సూచనల్ని వివరించండి .
జ :ఖరీదైన యాంటీ ఏజింగ్ ఉత్పత్తులు యవ్వనవంతమైన చర్మానికి సంబంధించి ప్రధానపాత్ర పోషించినప్పటికీ మనము చేపట్టాల్సిన చర్యలు కొన్ని ఉంటాయి. అవి ->..
మంచినీళ్ళు : చర్మము చక్కని తేమతో ఉండి శరీరము లోపలి విషతుల్యాలు వెలికి పోవాలంటే రోజుకు కనీసము 5-6 గ్లాసులు (1 లీ.-1.5 లీ) నీరు తాగుతుండాలి . మంచినీళ్ళు , బ్లాక్ లేదా గ్రీన్ టీ ఆరోగ్యాన్ని మెరుగు పరిచే ఫ్లేవనాయిడ్స్ ను అందిస్తాయి. బాగా రసాలతో నిండి ఉండే పండ్లు , కూరలు చర్మము హైడ్రే్షన్ ను , డెన్సిటీని పెంచుతాయి.
ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ : సల్మాన్ , సార్డిన్స్ , వాల్ నట్స్ , గుడ్లు లలో ఎక్కువగా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్నందున చర్మకణాలకు బాగా మంచిది.
ఎ,సి,ఇ విటమిన్లు : ఈ మూడు విటమిన్లు చర్మానికి మంచి చేస్తాయి. పాలకూర , క్యారెట్లు , చిలగడదుంపలు , యాప్రికోట్స్ లలో ఉండే యాంటీ ఆక్షిడెంట్స్ త్వరితము గా వార్ధక్యానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్ నుండి చర్మాన్ని రక్షిస్తాయి. కివి , సిట్రస్ పండ్లు , బ్రొకోలి లలో ఉండే విటమిన్ ' సి" , కొల్లాజిన్ మెరుగుపరిచే గుణము , ఆకుకూరలలో ఉండే విటమిన్ " ఇ " సూర్యకిరణాలనుండి చర్మాన్ని రక్షిస్తాయి .
పూరిస్థాయి ధాన్యాలు : వీటిలో లభించే యాంటీ ఏజింగ్ యాంటి ఆక్షిడెంట్లు , పీచు చర్మానికి హానిచేసే చెడు కొలెస్టిరాల్ నుండి , విషపదార్ధాలు (టాక్షిన్‌లు )నుండి కాపాడుతాయి.
సిలికా : ఇది చర్మము లోని తేమను పట్టివుంచి వెలాసిటీ ని మెయిన్‌టైన్ చేయడము లో సహకరిస్తుంది .
కెరొటినాయిడ్స్ : ఆకుకూరలు , పండ్లు , క్యారట్ లలో ఉండే కెరొటినాయిడ్స్ చర్మాన్ని ఆరోగ్యవంతం గాను , కాంతివంతం గాను ఉండేందుకు సహకరిస్తాయి.
ఈ విధము గా ఆహార ఆలవాట్లు , వ్యాయామ అలవాట్లు , తగినంత నిద్ర వయసు తక్కువగా కనబడేందుకు దోహదం చేస్తాయి.
- ============================
visit my website - > Dr.Seshagirirao-MBBS
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.