ప్ర : జామపండ్లు బాగా లభించే కాలమిది. మా పిల్లలకు ఈ పండ్లంటే చాలా ఇష్టం. కానీ అవి తింటే జలుబు చేస్తుందని తీసుకోనివ్వట్లేదు. ఇందులో వాస్తవముందా?
జ : జామపండు తింటే జలుబు చేస్తుందనడంలో వాస్తవం లేదు. ఎవరైనా తినొచ్చు. అయితే జలుబు కొద్దిగా ఉన్నప్పుడు తీసుకుంటే అది ఇంకా తీవ్రమవుతుంది. ఒక్కోసారి అలర్జీతో బాధపడే వారికి జామపంటకు వాడే మందుల వల్ల త్వరగా జలుబు చేసే అవకాశం ఉంటుంది. వాస్తవానికి ఈ పండులో పోషకాలు అమోఘం. విటమిన్ 'సి- 212 గ్రా, ఇనుము- 0.27మి.గ్రా, కెరోటిన్లు- 510మి.గ్రా, శక్తి- 51కి.కెలొరీ, తేమ- 81.7 గ్రా, కొవ్వు- 0.3గ్రా, పీచు- 5.2మి.గ్రా;.
* బాగా పండిన పండులోని పీచు పదార్థం మలబద్ధకం తగ్గిస్తుంది. దోరగా ఉన్నవి ఆరోగ్యానికి మేలు. వీటిలోని ఖనిజాలు, విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఎముక పుష్ఠికీ తోడ్పడతాయి.
* గర్భిణికి వచ్చే సహజ మల బద్ధకానికి ఇది ఔషధం. కడుపులోని ఎంజైములను చురుగ్గా చేసే శక్తి వీటి సొంతం. కాబట్టి చంటిపిల్లలకు గింజలను వడకట్టి ముద్దగా చేసి ఇస్తే విరేచనం సాఫీగా అవుతుంది.
* చక్కెర, కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు, రోజుకి ఒకటి నుంచి రెండు పండ్లు తింటే మంచి ఫలితం ఉంటుంది.
- =================================================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.