ప్ర : మా బాబు బాగా కష్టపడి చదువుతాడు. కానీ పరీక్ష హాలులోకి వెళ్లినప్పుడు ఏమీ గుర్తుకు రాదు. టెన్షన్‌పడతాడు. ఎందుకిలా అవుతాడో అర్థం కాదు. సమస్యకు పరిష్కారం చెప్పగలరు ?
జ : టెన్షన్ అన్నది పిల్లలో ఉండే తత్వం. ఇది ఇంట్లో పెంపకాన్ని బట్టి ఉంటుంది. చిన్నప్పుడు ముందు జాగ్రత్తలు ఎక్కువచెప్పడం దీనికి ఒక కారణం. భయం వల్ల టెన్షన్ పెరుగుతుంది. ఐదేళ్ల తర్వాత యాంగ్జైటీ మొదలవుతుంది. రోజూ ప్రణాళికా బద్దంగా చదవడం అలవాటు చేసుకోవాలి. పరీక్షలకు రెండు నెలల ముందు సిలబస్‌ను పూర్తి చేసుకుని, పునరుచ్ఛరణ చేసుకోవాలి. పరీక్షలకు పది రోజుల రోజూ పది నిమిషాలు హాలులో ఎలా పరీక్ష రాస్తామో ఊహించుకోవాలి. దీని వల్ల పరీక్ష హాలులోకి వెళ్లినప్పుడు టెన్షన్ తగ్గుతుంది.
- -----------------------------------------------------------------------------
- ======================================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.