జ : ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడం వల్ల నడుం నొప్పి, మెడనొప్పి రావడం సాధారణం. ఎంఆర్‌ఐ రిపోర్టును బట్టి చికిత్స చేయవచ్చు. కానీ మీరు ఎంఆర్‌ఐ రిపోర్టులో ఏం రాశారో తెలుపలేదు. నడుం నొప్పికి ప్రధాన కారణం సరిగా కూర్చోకపోవడమే. కూర్చునే విధానం తెలియాలి. గంటల కొద్దీ కూర్చోకుండా గంటకోసారి రిలాక్స్ కావాలి. డెస్కు పనిచేసేవాళ్లు నడుం ఎక్సర్‌సైజులు రెగ్యులర్‌గా చేయాలి. సరిగా కూర్చోవడం, నడవడం, నిల్చోవడం, బరువులెత్తడం అలవాటు చేసుకుంటే 90 శాతం నడుం నొప్పిని దూరంగా ఉంచవచ్చు. మీకు డిస్క్ జారడం వల్ల నడుం నొప్పి వచ్చిందని అనుమానం. దీని వల్లే కాళ్లలో తిమ్మిర్లు వస్తాయి. మీరు దగ్గర్లోని స్పైన్ లేదా ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలవండి.
Source : రక్ష డెస్క్ Mon, 15 Aug 2011.
- ===========================================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.