Q : నా వయసు ఇరవైనాలుగు. కొంతకాలం క్రితం మొక్కుపేరుతో జుట్టును పూర్తిగా తీయించుకున్నా. ఆ తరవాత నెలకోసారి హెర్బల్ హెన్నా పెట్టుకుంటున్నా. ఇప్పుడు జుట్టు మెడ దగ్గరకు ఉన్నా.. నల్లగా కనిపిస్తోన్నా.. విపరీతంగా రాలుతోంది. వీపు, మెడభాగం చర్మం కూడా బాగా నల్లగా మారింది. తలకట్టు పలుచగా కనిపిస్తోంది. ఏం చేయాలి.
A : హెర్బల్ హెన్నా వాడుతున్నారని రాశారు. కానీ అలాంటి రకాలు బజార్లో తక్కువగా లభిస్తాయి. మీరు వాడే హెన్నాలో రసాయనాలు కలిపితేనే కురులు నల్లబడతాయి. కేవలం ఆ ఉత్పత్తులు జుట్టును నల్లబరచలేవు. ఇక, తలకు వేసుకునే రంగుల్లో రసాయనాలు ఉండటం వల్ల ఎలర్జీ వచ్చే ఆస్కారం ఎక్కువ. అందుకే మీ మెడ, వీపు భాగం నల్లగా తయారైంది. క్రమంగా ఆ ప్రభావం ముఖంపైనా పడుతుంది. జుట్టు కూడా అందుకే రాలుతుండవచ్చు. ఏం చేస్తారంటే.. ఏదైనా నూనెతో వారానికి రెండుసార్లు తలకు మర్దన చేసుకుని గంటాగి తలస్నానం చేయండి. బజార్లో దొరికేవి వాడకుండా.. ఇంట్లోనే సొంతంగా తయారుచేసుకోండి. కప్పు హెన్నా తీసుకుని టీ డికాక్షన్‌తో కలిపి, కాయ నిమ్మరసం, నాలుగుచెంచాల ఉసిరిపొడి చేర్చండి. రెండుగంటలు తరవాత తలకు పెట్టుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
- ========================================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.