హరీశ్వర్, ఇబ్రహీంపట్నం
A : నేసల్‌పాలిపొసిస్ ఎలర్జీ వల్ల వచ్చేది. మన దేశంలో 30 శాతం మంది నేసల్ ఎలర్జీ లేదా బ్రాంకైల్ ఎలర్జీతో బాధపడుతున్నారు. ఎక్కువగా ఆస్ప్రిన్ వాడేవారిలో నేసల్‌పాలిపోసిస్ ఉండే అవకాశముంది. మందులతో రెండు నెలల వరకు చికిత్స చేస్తారు. చికిత్స ఉపయోగించే స్టీరాయిడ్స్ వల్ల ఎలాంటి హాని ఉండదు. స్టీరాయిడ్లు మందుల రూపంలో లేదా బిళ్లలరూపంలో ఉంటాయి. 50 నుంచి 60 శాతం మంది మందులకు స్పందిస్తారు. స్పందించని వారికి సిటి స్కాన్ చేస్తారు. వ్యాధి తీవ్రతను గుర్తిస్తారు. ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ చేస్తారు. ఆపరేషన్ తర్వాత 5 నుంచి 10 ఏళ్లపాటు డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స కొనసాగించాలి. పర్యవేక్షణలో లేకుంటే వ్యాధి మళ్లీ వచ్చే అవకాశముంది. అలాగని ఆపరేషన్ ఫెయిలయ్యిందిన భావించకూడదు. ఇది వ్యాధి గుణం. ఆపరేషన్ సక్సెస్ రేటు 90 శాతం ఉంటుంది.
- ==================================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.