ప్ర : నేను ఉద్యోగస్తురాలిని. వయసు 23. ఒత్తిడి అధికంగా ఉంటుంది. శాకాహారిని. ఆహారం, నిద్ర టైం ప్రకారం ఉండవు. గత కొన్ని మాసాలుగా తరచూ నోటిపూతతో బాధపడుతున్నాను. అన్నం సరిగ్గా తినలేకపోతున్నాను. పరిష్కారం సూచించండి.
- రమ్య, హైదరాబాద్
జ : నోటిపూత, పుండ్లు.. ఈ సమస్యలతో చాలామంది బాధపడుతుంటారు. పనుల ఒత్తిడితో ఆహార నియమాలు పాటించకపోవడం, పోషకాహారలోపం, విటమిన్ సి, బి2, బి3, ఇనుము, క్యాల్షియం వంటి ఖనిజాలు తగ్గినప్పుడు నోటిలోని సున్నిత పొరలు చిట్లి పుండ్లుగా మారుతుంటాయి. కొన్ని సందర్భాల్లో స్త్రీలలో తలెత్తే హార్మోన్ల సమస్య, ఘాటైన ద్రవ్యాలు ఎక్కువగా వాడటం, కాఫీ టీలు అధికంగా తీసుకోవడం వల్ల నోటి పూత సమస్య తలెత్తుతుంది. సాధారణంగా ఆహార మార్పులతో తగ్గిపోతుంది.
ఆయుర్వేదిక్ చికిత్స :
ఈ సమస్య నుంచి బయటపడటానికి ఆహార నియమాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. జీవన శైలి మార్పులూ అవసరమే.
* వీలైనంత వరకూ ప్రతిరోజూ ఆహారంలో ఆకు కూరలు ఉండేలా చూసుకోవాలి. రెండు, మూడు గ్లాసుల మజ్జిగ తాగాలి.
* రాత్రి నిద్రపోయే ముందు గ్లాసుడు పాలు తాగితే కడుపులో ఏర్పడే పూతలు, మంటలు తగ్గుతాయి. నోటి పూత సమస్య బాధించదు.
* పొద్దున లేవగానే పటికను పావు చెంచా తీసుకుని నీళ్లలో మరిగించి చల్లారాక పుక్కిలించాలి. ఈ విధంగా రోజుకి 2, 3 సార్లు చేస్తే సమస్య తగ్గుతుంది.
* రావి పాలలో మంచి నెయ్యి కలిపి పూత ఉన్న చోట రోజుకి ఒకటి రెండుసార్లు రాస్తుంటే త్వరగా తగ్గుతుంది.
* ప్రతిరోజూ రాత్రి అర చెంచాడు ఉసిరిక రసం నీళ్లలో కలిపి పుచ్చుకొన్నా ఫలితం ఉంటుంది.
* అతి మధురం వేళ్లను కషాయంగా చేసి పుక్కిలిస్తే నోటిపూత తగ్గుతుంది. అలాగే మెంతి ఆకులను కషాయంగా చేసి పుక్కిలించినా మంచిదే.
డా|| పెద్ది రమాదేవి-ఆయుర్వేదిక్ ఫిజీషియన్-ఫోన్: 9246276791
ఆలోపథిక్ చికిత్స :
నోటి శుబ్రతను పాటించాలి . భోజనం తరువాత చేతి వేళ్ళల్తో పళ్ళను శుబ్రము గా తోముకోవాలి లేదా టూత్ పేస్ట్ తో బ్రష్ చేస్తే మరీ మంచిది. దీనివల్ల పళ్ళ సందుల్లో ఇరుక్కుపోయిన ఆహారపదార్దాల తో సూక్ష్మజీవుల పక్రియ తగ్గి నోరు పరిశుబ్రముగా ఉంటుంది .
నోటిపూత ఉన్నవాళ్ళు :
Dentacain mouth wash ,or Hexin mouth wash , or Betadin mouth wash తో రోజుకి రెండుసార్లు పుక్కలించాలి .
Tab. Beplex forte రోజుకొకటి చొప్పున 7-10 రోజులు వాడాలి , లేదా...
Tab. Folic acid రోజుకి ఒకటి చొప్పున్న 7-10 రోజులు వాడాలి ,లేదా.....
Tab.Supradyn రోజుకి ఒకట్ చొప్పున్న 7-10 రోజులు వాడాలి ,
నోటి పుల్లు ఎక్కువగా బాధపెడుతుంటే ... Tess mouth gel Ointment పుల్లు పై రాయాలి .
పౌష్టికాహారము తీసుకోవడం లోనే నోటిపూత చికిత్స ప్రముఖ పాత్ర వహిస్తుంది .
--డా. వందనా శేషగిరిరావు -శ్రీకాకుళం .
- ===================================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.