Kamala - Srikurmam
A : మూడు నుంచి 8 సంవత్సరాల పిల్లలు అడినాయిడ్స్ సమస్యతో బాధపడుతుంటారు. ముక్కుకు, నోటికి మధ్య పెరిగే కొయ్యగండలను ఎడినాయిడ్స్/టాన్సిల్స్ అంటారు. ముక్కు కుహరంలోని లింఫ్ గ్రంథులు, గొంతుకలోనున్న టాన్సిల్సు. ఇవి శరీరాన్ని క్రిముల దాడి నుండి కాపాడతాయి. ఈ అడినాయిడ్స్ మరీ ఉబ్బి పెద్దగా మారితే పిల్లలు శ్వాసను ముక్కుతో పీల్చలేక నోటితో పీల్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఇవి పెరగడం కొందరిలో ఎక్కువ, తక్కువ ఉంటుంది. జన్యుపరమైన కారణాల వల్ల కూడా పెరిగే అవకాశముంది. అడినాయిడ్స్ పెరిగి ఎక్కువ స్థలాన్ని ఆక్రమించినప్పుడు పిల్లలు ముక్కుతోకాక నోటితో గాలిపీలుస్తారు. గురక పెడతారు. తరచూ జలుబు, చెవినొప్పితో బాధపడతారు. ఈ సందర్భాలలో ఎక్స్‌రే తీస్తారు. ఎంత భాగంలో పెరిగిందనేది పరిశీలిస్తారు. తొలి దశలో కొంత కాలం మందులతో మూడు నుంచి నాలుగు నెలలు చికిత్స చేస్తారు. మందులతో చికిత్స చేసినా మార్పు రాకుంటే అడినాయిడెక్టమి ఆపరేషన్ చేస్తారు. ఆధునిక పరిజ్ఞానం వల్ల శస్త్ర చికిత్సలో నొప్పి తక్కువ ఉండే ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. ఉదయం ఆసుపత్రిలో చేరి ఆపరేషన్ తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్లొచ్చు. ఒకటి, రెండు రోజులు విశ్రాంతి తీసుకుని స్కూలుకు కూడా వెళ్లొచ్చు.
- =============================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.