Q : మేనరికం... రిస్క్ ఎక్కువా?,Are cousin marriages more risk at mental retardation?
నాకు మా బావతో పెళ్లి ఫిక్సయింది. మా మేనత్త కూడా అప్పట్లో తన మేనబావనే పెళ్లి చేసుకుంది. మా బావకు ఓ చెల్లెలు ఉంది. తను మానసికంగా ఎదగలేదు. ఇప్పుడు మా బావను పెళ్లి చేసుకుంటే నాకూ అలాంటి పిల్లలు పుట్టే అవకాశం ఉందా? భయంగా ఉంది. ఇంట్లో వాళ్లకు ఈ విషయం చెప్పలేకపోతున్నాను. మా బ్లడ్‌గ్రూప్స్ వేరే... నా భయాన్ని తీర్చగలరు.
- హంసదుర్గ, ఇ-మెయిల్
A : మేనరికం వల్ల పుట్టే పిల్లల్లో జన్యుపరమైన లోపాలు వచ్చేందుకు అవకాశం కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. మొదటి తరమే కాక ముందు తరాలలో కూడా మేనరికం ఉన్నా, వారికి మానసికంగా ఎదగని పిల్లలు పుట్టి ఉన్నా మీకూ ఇటువంటి పిల్లలు పుట్టేందుకు ఈ రిస్క్ మరింత అధికంగా ఉండవచ్చు. జన్యుపరమైన లోపాలు కొన్నింటిని ముందే గుర్తుపట్టడం సాధ్యమౌతుంది. కార్యోటైపింగ్ అనే పరీక్ష ద్వారా దంపతులిద్దరిలోనూ జన్యుపరమైన తేడాలను గుర్తించవచ్చు. కాని అన్ని లోపాలనూ గుర్తించడం సాధ్యం కాదు. అందుచేత ప్రెగ్నెన్సీ వచ్చాక మీరు జెనెటిక్ కౌన్సెలింగ్ తీసుకోండి. అలాగే ఆమ్నియో సెంటిసిస్ అనే ఉమ్మనీరు పరీక్షలో బిడ్డకు ఉన్న లోపాలను గుర్తించవచ్చు. అందుచేత మీరు అవసరాన్ని బట్టి ఆ పరీక్ష చేయించుకొని డెలివరీకి ముందే బిడ్డ ఆరోగ్యం గురించి సంతృప్తి చెందవచ్చు. బ్లడ్ గ్రూప్ వేరయినా ఆర్.హెచ్. టైప్ ఒకటే అయినట్లైతే బిడ్డపై ఎటువంటి ప్రభావం చూపదు.
డాక్టర్ రాధిక--గైనకాలజిస్ట్, నిమ్స్
- ===================================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.