- రాజేష్, పాలకొండ
A : స్పెర్మ్ కౌంట్ 20 మిలియన్ల కన్నా అధికంగా ఉన్నప్పుడు దానిని నార్మల్ కౌంట్‌గానే పరిగణిస్తాం. ఈ కౌంటే గాక వాటి ఆకృతి, కదిలిక కూడా ఎంతో ముఖ్యమైనవి. ఆకృతిలో తేడాలో ఉన్నా, కదలిక బాగా తక్కువగా ఉన్నా ఈ స్పెర్మ్స్ అండాన్ని చేరుకునే అవకాశం ఉండదు. మీ విషయంలో కౌంట్ బాగానే ఉన్నా కదలికలు ఉన్న స్పెర్మ్స్ మాత్రమే ఏమీ లేవు. అందుచేత ప్రెగ్నెన్సీ రాకపోయి ఉండవచ్చు. స్పెర్మ్ కౌంట్ పరీక్ష చేయించుకునేటప్పుడు శాంపుల్ కలెక్షన్ ఎంతో ముఖ్యమైనది. ల్యాబ్‌వారు సమకూర్చిన బాటిల్‌లోనే శాంపుల్ ఇవ్వడం, ఆ బాటిల్‌ని క్లీన్ చేయకుండా ఉండటం, అలాగే ఇంటిలో శాంపుల్‌ని కలెక్ట్ చేసినట్లయితే ల్యాబ్‌కి అరగంట లోపల అందజేయడం ఎంతో ముఖ్యం. కలయికకి ముందర కండోమ్ వాడినా, కొన్ని రకాల స్పెర్మ్‌సెడైడ్ జెల్లీస్ వాడినా ఇటువంటి రిపోర్ట్ రావచ్చు. అందుచేత మీకు చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించి స్పెర్మ్ కౌంట్ టెస్ట్ మరొక్కసారి చేయించుకోండి. తిరిగి ఇదే రిపోర్ట్ వచ్చినట్లయితే ఆండ్రాలజిస్ట్‌ని సంప్రదించి తగిన సూచనలు పొందండి. పీరియడ్స్ కూడా 25 రోజుల గ్యాప్‌తో వచ్చేలా మీ భార్యకి చికిత్స ఇప్పించండి.
డాక్టర్ రాధిక--గైనకాలజిస్ట్, నిమ్స్
- ===================================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.