- ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
అరుణకుమారి - శ్రీకాకుళం టౌన్.
జ : వైద్యులను కలవాలంటే ... టైమ్ ఉండదు , ముందుగా ఎపాయింట్ మెంట్ ఉండాలి. ఏదో చిన్న సమస్యే కదా వెయిట్ చేస్తే పోలే అని అనుకుంటారు. చాలా మంది అనారోగ్యము అనిపించినా నిర్లక్ష్యము చేస్తూ ... దానంతటదే సర్దుకుంటుందిలే అని అభిప్రాయ పడతారు. నిర్లక్ష్యము మంచిది కాదు . మంచి డాక్టర్ ని కలవాలి. శరీరవ్యవస్థ దానికి వచ్చే అసౌకర్యాలను లక్షణాల రూపేన మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఈ క్రింది వాటిలో శరీరము చెప్పేది వినండి .
1. నియంత్రణలేని క్రేవింగ్ (uncontrolled Craving) : తరచుగా దాహము గా ఉంటున్నా , ఆకలి గా ఉంటున్నా , తీపి తినాలనిపిస్తున్నా ... అది బహుసా డయాబిటీస్ (మధుమేహము ) కు సూచన . అలసట , కళ్ళు తేలిపోవడము , నీరసము , బరువు తగ్గిపోవడము ... ఇలా రోజుకు ఒకసారి కంటే ఎక్కువ ఉంటే వైద్యుని సంప్రదించి సుగరు స్థాయిలను తనికీ చేయించుకోవాలి.
2. బరువు తగ్గడము , పెరగడము : కొద్ది కిలోలు అటు ..ఇటు కావడము సహజమే . కాని ఈ తేడాలు సుమారు 2 నెలలో 6-7 కిలోలు ఎక్కువ... తక్కువా ... అనిపిస్తే థైరాడ్ వ్యాదులకు సూచన కావచ్చును . వైద్యుని సంప్రదించాలి.
3.ఎక్కడైనా కణితి (Lump) : శరీరము ఏ భాగములోనైనా ఉండమాదిరిగా లంప్ తగులుతున్నా ... సహజము గా రెండు వారాలలో అది తగ్గకపోయినా ..క్యా్న్సర్ కు సంబంధినది కావచ్చు .... వైద్యుని సంప్రదించాలి.
4 . శరీరము , మనసు చెప్పేవి : శారీరకము గా , మానసికం గా బాగా లేనప్పుడు అందుకు తగిన సిగ్నల్స్ అందుతుంటాయి .వాటిని తప్పనిసరిగా పరిగణలోనికి తీసుకోవాలి. .
జలుబు చేస్తే డాక్టర్ వద్దకు వెళ్ళాల్సిన అవసము రాఫు . అదే తీవ్రమైన గొంతునొప్పి లేదా సైనస్ , నిరంతము దగ్గు , తలనొప్పి, తూలిపోవడము , ఎప్పుడూ శరీరము లో జ్వరము ఉన్నట్లు ఫీలవడమూ, తిన్నది మామూలే అయినా జీర్ణము కాకపోవడము , రోజూ 3 సార్లు కంటే ఎక్కువ విరోచనము అవడము , స్త్రీలలో మాటి మాటి కీ రక్తస్రావము అవడము మున్నగు అనేక సాదారణ ఆరోగ్య సమస్యలు నిర్లక్ష్యము చేయకుండా సరియైన వైద్యుని కలవాలి.
- =====================
visit my website - > Dr.Seshagirirao-MBBS
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.