- ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
ప్ర : What is Brain workouts?-బ్రెయిన్ వర్కవుట్లు అంటే ఏమిటి?
జ : మెదడు చురుగా , పాదరసం లా పనిచేయడానికి ... ప్రతిరోజూ మెదడుకు వ్యాయామాలు అవసరము . బ్రెయిన్ ఎక్షరసైజ్ లనే " బ్రెయిన్ వర్క్ అవుట్స్ " అంటాము . ప్రరోజూ రొటీన్‌గా ఈ బ్రెయిన్ వర్కవుట్లు భాగము చేసుకోవాలి . వార్తాపత్రికల్లోని క్రాస్ వర్డ్ పజిల్స్ పూర్తి చేస్తూ ఉండాలి . కాలిక్యులేటర్ దాచేసి , పేపర్ , పెన్సిల్ తీసుకొని నెలవారీ బడ్జెట్ నో , ఇతర లెక్కల్నో వేసుకోండి . ప్రయాణము చేస్తూంటే ఆయా ప్రదేశాలకు వెళ్ళగల సమయాన్ని , తదుపరి స్టేషన్ ను అంచనా వేసుకుంటూ ఉండాలి. గ్రాసరీ బిల్లుల్ని బుర్రలోనే అంచనా చేసుకోవాలి. ఎక్కడ షాపింగ్ చేయాలి , బడ్జెట్ ఎంత అన్న లెక్కలూ కడితే మెదడుకు పదును లభిస్తుంది.
- ======================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.