- ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
ప్ర : నా వయసు 55 సం.లు . పదేళ్ళుగా డయాబెటీస్ ఉంది . గత ఆర్నెళ్లు గా తరచూ మూత్రానికి వెళ్ళాలసివస్తోంది. కంట్రోల్ చేసుకోవడమూ కష్టముగా ఉంటోంది. షుగర్ , ''హెచ్బి ఎ 1 సి '' మామూలుగానే ఉన్నాయి. ప్రోస్టేట్ పరీక్షలు సాధారనముగానే ఉన్నాయి. మరి దీనికి కారణము ఏమిటి? .
జ : దీర్ఘకాలిక డయాబెటీస్ ఉన్నవారికి పాలీయూరియా మరియు యు.టి.ఐ. (Urinary Tract Infection) ఉండవచ్చును . యూరిన్ రొటీన్ టెస్ట్ , మైక్రోస్కోపిక్ చేయించుకోండి . దానివలన కొంత సమాచారము తెలుస్తుంది. . మీరు '' నీరు '' ఎక్కువగా తాగండి . మూత్రానికి తరచూ వెళ్తుండండి . వైస్యుల సలహా మేరకు తీపి పదార్ధాలు , తీపి పండ్లు తినడము మానేయంది . రోజూ బి.కాంప్లెక్ష్ మాత్ర తీసుకోండి. అవసమనుకుంటే డాక్తర్లు సలహా తో Anti-cholinergics తీసుకోండి . బ్లాడర్ రీ టరినింగ్ టెక్నిక లు డాక్టర్ ని అడిగి ప్రాక్టిస్ చేయండి.
- =================================================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.