ప్ర : మూత్రము లో ప్రోటీన్ పోతూ ఉంటే గుండెపోటు వస్తుందా?
జ : మూత్రంలో ఏమాత్రం ప్రోటీన్ పోతున్నా మధుమేహులు జాగ్రత్త పడటం మంచిది. ఎందుకంటే మధుమేహుల్లో కిడ్నీ సమస్యలూ తలెత్తే అవకాశముంది. దీంతో మూత్రంలో అల్బుమిన్ అనే ప్రోటీన్ పోవటం కనిపిస్తుంది. ఇలాంటివారికి గుండెపోటు, పక్షవాతం, గుండెవైఫల్యం ముప్పు ఎక్కువగా ఉంటున్నట్టు తాజాగా బయటపడింది. సాధారణంగా 90% మంది మధుమేహుల్లో మూత్రంలో అల్బుమిన్ స్థాయులు మామూలు మోతాదులోనే ఉంటాయి. అయినప్పటికీ వీరికి కూడా గుండెజబ్బుల ముప్పు పెరుగుతోందా? అనేదానిపై ఇటలీ పరిశోధకులు తొమ్మిదేళ్ల పాటు అధ్యయనం చేశారు. ఈ ప్రోటీన్ మోతాదు కొద్దిగా పెరిగినా గుండె సమస్యల ముప్పు పొంచి ఉంటున్నట్టు గుర్తించారు. ఇక దీని మోతాదు పెరుగుతున్నకొద్దీ ముప్పూ ఎక్కువవుతూ వస్తోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల మధుమేహులు మూత్రంలో అల్బుమిన్ పోతుంటే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించటం మేలని నిపుణులు సూచిస్తున్నారు.
- ================================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.