ప్ర : పాలిండ్ల(breast) సైజుల్లో తేడాలుంటాయి ఎందుకని?
జ : అనేక మంది పెళ్లీడుకొచ్చిన యువతులతో పాటు వివాహమైన మహిళల పాలిండ్ల సైజుల్లో(breast sizes) పెద్ద తేడాలు ఉంటాయి. ముఖ్యంగా... కొంతమంది యువతులు తమ వక్షోజాలు చిన్నవిగా ఉండటాన్ని జీర్ణించుకోలేరు. దీంతో వివాహమైన తర్వాత తమ భర్తలను సుఖపెట్టలేమన్న బెంగ వారిని పట్టుకుటుంది. ఇదే అంశంపై సెక్స్ నిపుణులను సంప్రదిస్తే..
సాధారణంగా వక్షోజాల సైజుల్లో తేడాలు ఉంటాయి. దీనికి ప్రధాన కారణం రొమ్ముల్లోని కొవ్వు కణజాలాన్ని బట్టి వాటి సైజు ఉంటుందన్నారు. చిన్నగా ఉండటం ఒక్కోసారి వంశపారంపర్యంగా ఉండవచ్చంటున్నారు. వివాహమై, పిల్లలు పుట్టి, పాలిచ్చే సమయంలో రొమ్ముల్లోని పాలగ్రంథుల పరిమాణంలో మార్పు వచ్చి సైజు పెరిగే అవకాశం ఉంటుందని చెపుతున్నారు.
అలాగే, ఆహారంలోనూ కొవ్వు, వెన్న, నెయ్యి, ఇతర కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల వక్షోజాల సైజులు పెంచుకోవచ్చని సలహా ఇస్తున్నారు. ఒకవేళ మరీ చిన్నగా ఉంటే సిలికాన్ ఇంప్లాం చేయించుకోవచ్చని చెపుతున్నారు. ముఖ్యంగా భర్తని సంతోష పెట్టడానికి శరీర కొలతలు సర్జరీల ద్వారా మార్చుకునే బదులు గొప్ప వ్యక్తిత్వంతో మనస్సు గెలుచుకుని సంతోష పెట్టేందుకు ప్రయత్నించాలని కోరుతున్నారు.
- ==================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.