- ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
ప్ర : నేను గర్భం దాల్చాను. నాకు కాఫీ తాగే అలవాటు చాలా ఎక్కువ. ఇప్పుడు కూడా అలా తాగవచ్చా?
జ : గర్భధారణ సమయంలో ఉదరంలో ఎసిడిటి పెరిగి చాలా అసౌకర్యంగా ఉంటుంది. దీనివల్ల వికారం, గుండెల్లో మంట వంటి లక్షణాలు పెరగుతాయి. కాఫీ తాగడం వల్ల ఎసిడిటి మరింతగా పెరుతుంది. కాబట్టి కాఫీని రోజుకు ఒకటి లేదా రెండు కప్పులకు మాత్రమే పరిమితం చేయండి. గర్భం దాల్చాక కాఫీని నియంత్రించుకోక తప్పదు. అలవాటు మార్చుకోలేకపోతే, ఒకసారి ఈ విషయంలో మీ వైద్యురాలి వద్ద ప్రస్తావించి ఆమె సలహా తీసుకోవడం ఉత్తమం.
- =================================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.