- ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
ప్ర: రోజంతా హుషారుగా ,ఆనందము గా ఉందేందుకు ఆరో్గ్య సూత్రాలు చెప్పండి ?
జ : ముచ్చట గా మూడు సూత్రాలు పాటించాలి .
1) నిద్ర : మనిషికి నిద్ర ఎంత అవసరమో గుర్తించుకొని నిద్ర పోవాలి. అందరికీ ఒకే గంటల నిద్ర చాలదు . వ్యక్తి వ్యక్తి కి నిద్రకు సంబందించి తేడాలు ఉంటాయి. నిద్ర పోయే సమయము , సహజము గా లేచే సమయము నోట్ చేసుకోవాలి ... ఇలా ఒక వారము చేయాలి . అప్పుడు మనిషికి కావలసిన సగటు నిద్ర కాలము తెలుసంది. సరాసరి రోజుకి 8 గంటలు నిద్ర అవసరము .
2) పానీయాలు : శరీరము లో నీటి కొరత ఏర్పడితే మూడ్ మారిపోతుంది. మంచినీరు , పానీయాలు అన్నీ కలిపి రోజుకి 1.5 నుంది 2.0 లీటర్ల వరకూ త్రాగాలి. అవసరము కన్నా ఎక్కువ నీరు తాగితే శరీరక వ్యవస్థ నుండి ప్రధాన లవణాలు వెలికి వెళ్ళిపోయే అవకాశము ఉన్నది. అందుకే మన శరీరము లో దాహము అనే ప్రక్రియ నిరంతమూ పనిచేస్తూ ఉంటుంది.
3). కదలిక : అది ఉదయమా , సాయంత్రమా అన్నది పక్క పెట్టి ఎప్పుడు వీలుపడితే అప్పుడు వ్యాయామము చేయాలి . సుమారు రోజుకు 30 నిముషాలనుండి 60 నిముషాల వరకూ నడక చాలు. ఎవరికి వీలైన ఎక్షరసైజ్ వారు చేసుకున్నా మంచిదే. వ్యాయామము మెదడుకూ, శారీరానికీ ఉత్సాహాన్నీ , ఉత్తేజాన్ని కలుగజేస్తుంది .
- ====================== \
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.