Wednesday, November 30, 2011

Allergic Rhinitis, ముక్కు కారుతుంది ఏమి?



ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము

ప్ర : మా బాకుకి 9 ఏళ్ళు . సీజన్‌ మారినప్పుడల్లా ముక్కు కారుతుంది . కళ్ళు కూడా . కారణమేమిటి?

జ : ఇదో రకము ఎలర్జీ . ముఖ్యముగా దుమ్మే కారణము . దుమ్ము , పొగలకు ఎక్ష్పోజైనపుడు , మారిన సీజన్‌ ... ఎలర్జీ కి కారణమవుతుంది . దానిమాలాన ముక్కు నుండి కళ్ళ నుండి ద్రావకాలు (నీరు రూపం లో) కరుతాయి. బాబు వయసు పెరిగే కొద్దీ తగ్గిపోతుంది .
యాంటీ ఎలర్జిక్ ఐ డ్రాప్స్ , నేషల్ డ్రాప్స్ వాడితే బాధ నుండి బయటపడవచ్చును . యాంటి ఎలల్జిక్ సిరప్స్ ఉదా. సెట్రజిన్‌ సిరప్ వాడవచ్చును .
  • ===============================
visit my website - > Dr.Seshagirirao-MBBS

Wednesday, October 26, 2011

లావు అవడానికి ఏదైనా టానిక్ ,Tonic for bulky growth



ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు. ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును. ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము.

ప్ర : మాబాబు వయసు 11 సమ్వత్సరాలు . తనకి మిల్క్ షేక్స్ , సూప్ లు , సెమిసాలిడ్ పదార్ధాలు మాత్రమే ఇష్టము . సడెన్‌ గా పొడవు పెరిగి సన్నగా కనపడు తున్నాడు . లావు అవడానికి ఏదైనా టానిక్ చెప్పరా?

జ : పదకొండేళ్ళ వయస్సు పిల్లలకు ఖచ్చితమైన డైట్ అవసరము . చిన్నతనము లో సమిసాలిడ్ పదార్ధాలు , నాన్‌ సాలిడ్ పదార్ధాలివ్వడము సులువుగా ,సౌకర్యముగా ఉండవచ్చు . చాలామంది తల్లులు పిల్లలకు ఈ విధము గా ఆహారాన్ని ఇస్తుంటారు . ఇదే ఆహారాన్ని ప్రీ-టీనేజ్ లోనూ కొనసాగిస్తారు . మంచిది కాదు .

సన్నగా కనబడడము ఎదో వ్యాధికాదు . చాలామంది పిల్లలు ఈ వయసులో ఇదే మాదిరి గా ఉంటారు . పొడవు పెరగడం ఈ దశలో ఎక్కువగా ఉంటుంది .

మీ బాబు ఆహారపు అలవాట్లు మార్చండి . మిగతా కుటుంబ సబ్యులు ఏవైతే తింటారో వాటినే తినిపించే ప్రయత్నాన్ని చేయండి . మెల్లమిల్లగా ఆ దారిలోనికి తీసుకురండి . అన్నిరకాల పదార్ధాలు తినిపించండి . వ్యాయామము క్రమము తప్పకుండా చేయించంది .

  • .=================================================

visit my website - > Dr.Seshagirirao-MBBS

Tuesday, September 27, 2011

ఒంటరితనము పిల్లలకు ఇబ్బందికి గురిచేస్తుందా?, Does Loneliness trouble children?



ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : ఒంటరితనము పిల్లలకు ఇబ్బందికి గురిచేస్తుందా?

జ: స్నేహితులు లేకుండా పెరిగే పిల్లలు యుక్తవయస్సు వచ్చేసరికి తీవ్రమైన డిప్రెషన్‌ కు గురవుతారని నిపుణులు పేర్కొంటున్నారు . సిగ్గుపడడము , ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్ష్ లోనవడము , ఎదుటివారి కళ్ళలోనికి సూటిగా చూడలేకపోవడము , సమావేషాలలోను , పదిమందిలోనూ మాట్లాడలేకపోవడము ... వంటి అనేక దిగుల్లకు లోనవుతారని అంటున్నారు ... మానసిక నిపుణులు .

స్నేహితులుంటే పిల్లలు తమ సమస్యలను వారితో పంచుకుంటారు . తమలో తామే వాటిని దాచుకొని మధనపడరు . దీనివల్ల వారిలో ఒంటరితనము , దిగులు , యాంగ్జైటీ, డిప్రషన్‌ వంటి వ్యతిరేక భావోద్రేకాలు ఉండవు . తమ తోటి పిల్లల్తో సాంగత్యము -- చురుకుదనాన్ని , ఉత్సాహాన్ని యిస్తాయి . ఎదిగేకొద్దీ జీవితం లో ఎదురయ్యే సవాళ్ళను ధైర్యముగా ఎదుర్కొనగల మానసిక సంసిద్ధత వారికి ఉంటుంది . కాబట్టి పిల్లలను చిన్నప్పటినుంచి చక్కని సామాజిక సంబంధాలకి ప్రోత్సహించాలి. అదేరీతిలో చెడు సవాసాలకు లోనుకాకుండా ఓ కంట కనిపెడుతూ ఉండాలి .

  • .=================================================

visit my website - > Dr.Seshagirirao-MBBS

Monday, August 29, 2011

ఏ రకమైన డయాలసిస్‌ మంచిది? , Which type of dialysis is good ?



  • https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEie7BdJdScxP3XGGeKaUUHi7woIS-U5KLbQlktVFEdQSEcA5CrvX3yrlTev3m0ilInWrM2NUTIT5VtuwKFo5NShJkzGQKvqyrbO5FsJvMVopAf68yK0RLwRGlJb8ctp6-p4hTrCnfIVydU/s1600/Kidney+Dialysis.jpg

Q : మా నాన్నగారి వయసు 58 సంవత్సరాలు. పది సంవత్సరాలుగా బిపి, మధుమేహం ఉంది. ఈ మధ్య ఆకలి లేకపోవడం, నీరసంగా ఉండటం, కాళ్లు, ముఖం వాపులొచ్చాయి. నడిస్తే ఆయాసం వస్తుంది. రక్తపరీక్ష చేయించాం. 2డి ఎకోటెస్ట్‌ చేస్తే గుండె పనితీరు శాతం తక్కువగా ఉందని చెప్పారు. డయాలసిస్‌ చేయించుకోవాలన్నారు. గుండె పదిశాతం పనిచేయడం వల్ల ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ చేయడం వీలుకాదన్నారు. నాకు ఏ రకమైన డయాలసిస్‌ మంచిది?

పెద్దిరెడ్డి, ఒంగోలు

A : మీకు ఇంట్లో చేసుకునే డయాలసిస్‌ (సిఎపిడి) చాలా మంచిది. ఇది కొన్ని రోజులు చేసుకుంటే మీ గుండె పనిశాతం పెరిగే అవకాశముంది. హాస్పిటల్‌లో చేసుకునే హీమోడయాలసిస్‌ వల్ల మీకు ఇబ్బందులు రావొచ్చు. మళ్లీ మళ్లీ ఆయాసం రావడంగాని, బిపి తగ్గిపోవడం జరగొచ్చు. గుండె తక్కువగా పనిచేసే రోగిలో వాపు, ఆయాసం ఎక్కువుంటాయి. ఇంట్లో చేసుకునే డయాలసిస్‌ (సిఎపిడి) వల్ల వాపుగాని, ఆయాసం రాకుండా మేయింటేన్‌ చేయొచ్చు. ఇది హాస్పిటల్‌ డయాలసిస్‌ కంటే చాలా మంచిది.


--డాక్టర్‌ శ్రీధర్‌ కన్సల్టెంట్‌ నెఫ్రాలజిస్ట్‌అవేర్‌గ్లోబల్‌హాస్పిటల్‌,హైదరాబాద్‌.


  • ========================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

డయాలసిస్ , Dialysis




Q :
నా వయసు 38 సంవత్సరాలు. దీర్ఘకాల మూత్రపిండాల వ్యాధి (సికెడి) నాలుగోదశతో బాధడుతున్నాను. వారానికి మూడుసార్లు డయాలసిస్‌ చేయించుకోవాలన్నారు. కచ్చితంగా వారానికి మూడుసార్లు చేయించుకోవాలా? ఒక సారిగాని, రెండు సార్లు గాని చేయించుకుంటే సరిపోతుందా? సలహా ఇవ్వగలరు.

ఆంజనేయులు, హుజూరాబాద్‌

A : కిడ్నీ (మూత్రపిండాలు) పని శాతం 15 కంటే తక్కువ ఉన్నప్పుడు దీర్ఘకాల మూత్రపిండాల వ్యాధి నాలుగోదశ అంటారు. ఈ దశలో డయాలసిస్‌ అవసరం ఏర్పడుతుంది. ఒకసారి ఈ దశకు చేరుకున్న తర్వాత కచ్చితంగా వారినికి మూడుసార్లు డయాలసిస్‌ చేయించుకోవడం మంచిది. కొంత మంది ఒక సారి లేదా రెండుసార్లు డయాలసిస్‌ చేయించుకున్నప్పటికీ ఏ ఇబ్బందులు ఉండవు. కానీ క్రమం తప్పితే డయాలసిస్‌ చేయించుకోవడం వల్ల ఇతర అవయవాల మీద దీని దుష్ఫలితాలు ఉంటాయి. ఇలా క్రమరహితంగా డయాలసిస్‌ చేయించుకోవడం వల్ల గుండె పనిచేయడం తగ్గుతుంది. జీవన ప్రమాణాం తగ్గే అవకాశముంది.


--డాక్టర్‌ శ్రీధర్‌ కన్సల్టెంట్‌ నెఫ్రాలజిస్ట్‌అవేర్‌గ్లోబల్‌హాస్పిటల్‌,హైదరాబాద్‌.

  • ==================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

నెఫ్రోటీక్‌ సిండ్రోం , Nephrotic Syndrome



Q : మా బాబు వయసు 8 సంవత్సరాలు. ఆరేళ్ల వయసులో ముఖం, కాళ్ల వాపులొచ్చాయి. మూత్రంలో ప్రోటీన్‌పోతోంది. నెఫ్రోటిక్‌ సిండ్రోం అని చెప్పి చికిత్స చేశారు. నెల రోజులు మందులు వాడిన తర్వాత ప్రోటీన్‌ పోవడం తగ్గింది. మందులు కూడా మానేశాం. 15 రోజుల తర్వాత మూత్రంలో ప్రోటీన్‌ వెళ్లడం మొదలైంది. మళ్లీ 15 రోజులు మందులు వాడిన తర్వాత ప్రోటీన్‌ పోవడం తగ్గింది. ఇలా మందులు వాడిన తర్వాత తగ్గుతుంది. మందులు మానగానే మళ్లీ యురిన్‌లో ప్రోటీన్‌ పోతుంది. ఇలా ఎక్కువ కాలం మందులు వాడితే సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చే అవకాశముందా? దీని వల్ల భవిష్యత్తులో కిడ్నీలు దెబ్బతినే ప్రమాదముందా?

శంకర్‌రెడ్డి, కదిరి.

A : నెఫ్రోటీక్‌ సిండ్రోం ఉన్నప్పుడు మొదటిసారిగా పూర్తిగా మూడు నెలలపాటు డాక్టర్‌ పర్యవేక్షణలో మందులు వాడాలి. కొంత మంది పిల్లల్లో మందులు మానగానే మళ్లీ ప్రోటీన్‌ పోవడం మొదలవుతుంది. ఇలాంటి పిల్లల్లో తక్కువ మోతాదులో మందులు 6 నుంచి 9 నెలల వరకు వాడాల్సి ఉంటుంది. కొంత మందిలో మందుల వల్ల దుష్ఫలితాలు వచ్చే అవకాశముంది. దుష్ఫలితాలు వచ్చినప్పుడు వేరే మందులు వాడాల్సి ఉంటుంది. చాలా మంది పిల్లల్లో ఈ వ్యాధి 12 నుండి 14 సంవత్సరాల వయసులో పూర్తిగా నయం అవుతుంది. భవిష్యత్తులో కిడ్నీ దెబ్బతినే అవకాశం చాలా తక్కువ.

--డాక్టర్‌ శ్రీధర్‌ కన్సల్టెంట్‌ నెఫ్రాలజిస్ట్‌అవేర్‌గ్లోబల్‌హాస్పిటల్‌,హైదరాబాద్‌.
  • ======================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

Thursday, August 25, 2011

జుట్టు రాలుతోంది,Hair falling







Q : నా వయసు ఇరవైనాలుగు. కొంతకాలం క్రితం మొక్కుపేరుతో జుట్టును పూర్తిగా తీయించుకున్నా. ఆ తరవాత నెలకోసారి హెర్బల్‌ హెన్నా పెట్టుకుంటున్నా. ఇప్పుడు జుట్టు మెడ దగ్గరకు ఉన్నా.. నల్లగా కనిపిస్తోన్నా.. విపరీతంగా రాలుతోంది. వీపు, మెడభాగం చర్మం కూడా బాగా నల్లగా మారింది. తలకట్టు పలుచగా కనిపిస్తోంది. ఏం చేయాలి.

A : హెర్బల్‌ హెన్నా వాడుతున్నారని రాశారు. కానీ అలాంటి రకాలు బజార్లో తక్కువగా లభిస్తాయి. మీరు వాడే హెన్నాలో రసాయనాలు కలిపితేనే కురులు నల్లబడతాయి. కేవలం ఆ ఉత్పత్తులు జుట్టును నల్లబరచలేవు. ఇక, తలకు వేసుకునే రంగుల్లో రసాయనాలు ఉండటం వల్ల ఎలర్జీ వచ్చే ఆస్కారం ఎక్కువ. అందుకే మీ మెడ, వీపు భాగం నల్లగా తయారైంది. క్రమంగా ఆ ప్రభావం ముఖంపైనా పడుతుంది. జుట్టు కూడా అందుకే రాలుతుండవచ్చు. ఏం చేస్తారంటే.. ఏదైనా నూనెతో వారానికి రెండుసార్లు తలకు మర్దన చేసుకుని గంటాగి తలస్నానం చేయండి. బజార్లో దొరికేవి వాడకుండా.. ఇంట్లోనే సొంతంగా తయారుచేసుకోండి. కప్పు హెన్నా తీసుకుని టీ డికాక్షన్‌తో కలిపి, కాయ నిమ్మరసం, నాలుగుచెంచాల ఉసిరిపొడి చేర్చండి. రెండుగంటలు తరవాత తలకు పెట్టుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
  • ========================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

కళ్ల కింద చారలు కట్టడి ఎలా?,Black color under eyes-prevention

Q : నా వయసు ముప్ఫైనాలుగు. కళ్లకింద చారలు వచ్చేశాయి. దాంతో వయసులో మరీ పెద్దదానిలా కనిపిస్తున్నాను. వాటిని తగ్గించుకునే మార్గాలేమైనా ఉన్నాయంటారా?

A : కళ్లకింద నల్లటి చారలు రావడానికి నిద్రలేమి, అదేపనిగా టీవీ కంప్యూటరు ముందు కూర్చోవడం.. అధిక ఒత్తిడి, ఎప్పుడూ దిగులుగా ఉండటం.. ముఖ్యంగా ఆహారంలో ఇనుము పోషకం లోపించడం... వంశ పారంపర్యము ...వంటివి ప్రధాన కారణాలు. రక్తంలో హీమోగ్లోబిన్‌ శాతాన్నీ గమనించుకోండి. ప్రతిరోజు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి. అలాగే బంగాళాదుంప తురుమును కళ్లపై పెట్టుకుని ఐదునిమిషాలయ్యాక తీసేయాలి. ఇలా పదిహేను రోజుల పాటు చేసి చూడండి. కాచిన పాలను ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా అయ్యాక దూదిని ముంచి కళ్లపై పెట్టుకుని పదినిమిషాలు విశ్రాంతి తీసుకోండి.

రోజుమార్చి రోజు కాచిన పాల మీగడతోగాని.. విటమిన్‌ ఈ క్రీంతోగానీ రెండు నిమిషాలు మర్దన చేసి పదినిమిషాలయ్యాక కడిగేయండి. కళ్లు మిలమిలలాడతాయి. వీటివల్ల ఎంతో మార్పు ఉంటుంది. మీరు తీసుకునే ఆహారంలో.. రోజూ నాలుగు నుంచి ఆరు ఖర్జూరాలు, పది ఎండుద్రాక్ష, ఒక టమాటా తప్పనిసరిగా ఉండాలి. వారానికి ఐదురోజులు ఆకుకూరలు తినండి. అది కుదరనప్పుడు ప్రతిరోజూ ఒకటిన్నర చెంచా వీట్‌గ్రాస్‌ పొడిని తీసుకోండి. మాంసాహారులైతే... వారానికోసారి కాలేయం కూరను తినండి. ఎంతో మార్పు ఉంటుంది.


for more details - click here -- black color under eyes
  • ==================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

పరీక్ష హాలులోకి వెళ్లినప్పుడు ఏమీ గుర్తుకు రాదు , Can not remember in exam hall




ప్ర : మా బాబు బాగా కష్టపడి చదువుతాడు. కానీ పరీక్ష హాలులోకి వెళ్లినప్పుడు ఏమీ గుర్తుకు రాదు. టెన్షన్‌పడతాడు. ఎందుకిలా అవుతాడో అర్థం కాదు. సమస్యకు పరిష్కారం చెప్పగలరు ?


జ : టెన్షన్‌ అన్నది పిల్లలో ఉండే తత్వం. ఇది ఇంట్లో పెంపకాన్ని బట్టి ఉంటుంది. చిన్నప్పుడు ముందు జాగ్రత్తలు ఎక్కువచెప్పడం దీనికి ఒక కారణం. భయం వల్ల టెన్షన్‌ పెరుగుతుంది. ఐదేళ్ల తర్వాత యాంగ్జైటీ మొదలవుతుంది. రోజూ ప్రణాళికా బద్దంగా చదవడం అలవాటు చేసుకోవాలి. పరీక్షలకు రెండు నెలల ముందు సిలబస్‌ను పూర్తి చేసుకుని, పునరుచ్ఛరణ చేసుకోవాలి. పరీక్షలకు పది రోజుల రోజూ పది నిమిషాలు హాలులో ఎలా పరీక్ష రాస్తామో ఊహించుకోవాలి. దీని వల్ల పరీక్ష హాలులోకి వెళ్లినప్పుడు టెన్షన్‌ తగ్గుతుంది.
  • -----------------------------------------------------------------------------
Source : రక్ష డెస్క్ Mon, 15 Aug 2011.....డాక్టర్‌ కళ్యాణ చక్రవర్తి--మానసిక వైద్యనిపుణులు--రేయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌--బంజారాహిల్స్‌, హైదరాబాద్‌.



  • ======================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

సామాజిక ఎదుగుదల , Social maturity




ప్ర : మా అమ్మాయి బి.ఫార్మసీ చదువుతోంది. వయసు 20 ఏళ్లు. ఆమెకు ఆడవాళ్ల కన్నా పురుషులతోనే ఎక్కువ స్నేహం చేస్తుంది. వాళ్లతో క్లోజ్‌గా ఉంటోంది. దీన్ని వారు అపార్దం ప్రేమగా భావిస్తున్నారు. చివరికి మనస్పర్దలు వస్తున్నాయి. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి?



జ : ఈ అమ్మాయికి సోషల్‌ మెచ్యురిటీ.. సామాజిక ఎదుగుదల తక్కువుందని అర్థమవుతోంది. అంటే మాట్లాడే విధానం, ప్రవర్తనలో తేడాలుంటాయి. వీరికి సమాజం గురించి అవగాహన కలిగించాలి. ఏ సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలనే విషయాలు నేర్పించాలి. చిన్నప్పటి నుంచి సమాజం పట్ల అవగాహన తల్లిదండ్రులు కలిగించలేదు. ఆమె ప్రవర్తన, మాటతీరును గమనించి సలహాలు, సూచనలు ఇవ్వలేదు. అందుకే ఈ సమస్య. పెంపకంలో లోపాలు, మానసిక ఎదుగుదల లేకపోవడం ఈ సమస్యకు కారణం. సినిమాలు, వినోదం కాలేజి అమ్మాయిలో ఎక్కువుంటుంది. ఇందులోనే ప్రపంచం ఉందనే ప్రభమలో ఉంటారు. ఒకరికి ఎక్కువ మంది బారుఫ్రెండ్స్‌ ఉంటే తమకు కూడా అలాగే ఉండాలని భావిస్తారు. కౌన్సిలింగ్‌ వల్ల వీరిని మంచి ఫలితం ఉంటుంది.

Source : రక్ష డెస్క్ Mon, 15 Aug 2011.
  • ==================================
visit my website - > Dr.Seshagirirao-MBBS