ప్ర : మాబాబు వయసు 11 సమ్వత్సరాలు . తనకి మిల్క్ షేక్స్ , సూప్ లు , సెమిసాలిడ్ పదార్ధాలు మాత్రమే ఇష్టము . సడెన్ గా పొడవు పెరిగి సన్నగా కనపడు తున్నాడు . లావు అవడానికి ఏదైనా టానిక్ చెప్పరా?
జ : పదకొండేళ్ళ వయస్సు పిల్లలకు ఖచ్చితమైన డైట్ అవసరము . చిన్నతనము లో సమిసాలిడ్ పదార్ధాలు , నాన్ సాలిడ్ పదార్ధాలివ్వడము సులువుగా ,సౌకర్యముగా ఉండవచ్చు . చాలామంది తల్లులు పిల్లలకు ఈ విధము గా ఆహారాన్ని ఇస్తుంటారు . ఇదే ఆహారాన్ని ప్రీ-టీనేజ్ లోనూ కొనసాగిస్తారు . మంచిది కాదు .
సన్నగా కనబడడము ఎదో వ్యాధికాదు . చాలామంది పిల్లలు ఈ వయసులో ఇదే మాదిరి గా ఉంటారు . పొడవు పెరగడం ఈ దశలో ఎక్కువగా ఉంటుంది .
మీ బాబు ఆహారపు అలవాట్లు మార్చండి . మిగతా కుటుంబ సబ్యులు ఏవైతే తింటారో వాటినే తినిపించే ప్రయత్నాన్ని చేయండి . మెల్లమిల్లగా ఆ దారిలోనికి తీసుకురండి . అన్నిరకాల పదార్ధాలు తినిపించండి . వ్యాయామము క్రమము తప్పకుండా చేయించంది .
- .=================================================
visit my website - > Dr.Seshagirirao-MBBS
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.