Thursday, December 1, 2011

అభ్యంగన స్నానము అంటే ఏమిటి?తలస్నానానికి జాగ్రత్తలు తెలియజేయగలరు ?



  • ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి. కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు. ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును. ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర :  అభ్యంగన స్నానము అంటే ఏమిటి? తలస్నానానికి జాగ్రత్తలు తెలియజేయగలరు ?

జ : ఏదైనా తైలముతో...  తల , శరీరము బాగా మర్ధన చేసి , తలస్నానం చేయుటను అభ్యంగన స్నానము అంటారు .  ఆయిలీ బాత్ (Oil bath) అని కూడా అంటారు . తలస్నానం చేసేటప్పుడు వెంట్రు కలు చిక్కుపడకుండానూ, వెంట్రుకల కుదుళ్ళు బలహీనపడ కుండానూ, శిరో జాలు రాలిపోకుండానూ, తెల్లబడ కుండానూ తగిన జాగ్రత్తలు తీసు కోవాలి. తలస్నానం చేసేటప్పుడు వెంట్రుకల రక్షణ, ఆరోగ్యంపట్ల ఏ విధ మైన శ్రద్ధ తీసుకోవలసినదీ ముందుగా తెలుసుకోవాలి. తలస్నానానికి షాంపూ ను ఉపయోగించే వారు దాన్ని ఏవిధం గా ఉపయోగించ వలసినదీ తెలుసు కోవడం అవసరం. షాంపూను సరిగా ఉపయోగించకపోయి నట్లయితే వెంట్రుకల ఆరోగ్యం పాడై, వెంట్రుకలు రాలిపోతాయి. తలరుద్దుకునే విషయం, పరిశుభ్రతకోసం వాడే వస్తువులు, నీరు, తలతుడుచుకునే తువ్వాలు, చిక్కుతీసే బ్రష్‌ లేదా దువ్వెన గురించి సరైన అవగాహన ఉండాలి.

1. తలస్నానానికి అధికవేడి నీటినికానీ, చన్నీటిని కానీ ఉపయోగించకూడదు. గోరువెచ్చని నీటిని మాత్రమే వాడాలి.

2.తలస్నానానికి పరిశుభ్రమైన నీటినే ఉపయోగించాలి. ఉప్పునీరు, బోరింగ్‌ నీరు కంటే శుద్ధమయిన నీటిని వాడటం కురులకు ఆరోగ్యకరం.

3. తలస్నానం చేయటానికి అరగంట ముందుగా కొబ్బరినూనెను వెచ్చచేసి, ఆ నూనెను వెంట్రుకల కుదుళ్ళకు చేరేలాగా పట్టించాలి. వేళ్ళతో మృదువుగా మసాజ్‌ చేయాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి.

4. తలస్నానానికి కుంకుడుకాయలు, సీకాయను వాడటం వల్ల జుట్టు మెత్తగా ఉండటమే కాక, జుట్టు ఆరోగ్యమూ బాగుంటుంది.

5. అభ్యంగన స్నానానికి ముందుగా మెంతులు రుబ్బిన ముద్దను తలకుపట్టించే వారు. పేల నిర్మూలనకోసం హారతి కర్పూరం పొడిని లేదా కలరా ఉండల పొడిని కొబ్బరినూనెలో కలిపి జుట్టుకు రాసేవారు. చుండ్రు నిరోధానికి నిమ్మ రసాన్ని కానీ, లేతవేపాకుల ముద్దను కానీ జుట్టుకు రాసేవారు. హెన్నా తలకుపూసే వారు ముందుగా తలమీద నీరుపోసి, వాటిని కడిగేసిన తర్వాతనే షాంపూను కానీ, సీకాయసబ్బును కానీ, సీకాయ పొడినికానీ, కుంకుడురసాన్ని కానీ వాడాలి.

6. తలతడిపిన తర్వాతనే షాంపూతో రుద్దుకోవాలి.

7.షాంపూను నేరుగా జుట్టు మీద వేసుకో కూడదు.చేతిలో కొంచెంవేసుకొని,నీళ్ళు కలిపి, ఆ తర్వాత తలకు పట్టించి, వెంట్రుకలను శుభ్రపరచాలి.

8. నిమ్మ, కమలాఫలం, నారింజ తొక్క లను, ఎండిన మందార ఆకులు లేదా పూలను మెత్తగా పొడిచేసి, ఆ పొడిని సీకాయ పొడిలో కానీ కుంకుడు కాయ పొడిలో కానీ లేదా కుంకుడు రసంలో కానీ కలిపి తల రుద్దుకుంటే జుట్టు త్వరగా తెల్లబడదు. వెంట్రుకలు నిగనిగ లాడుతూ, మృదువుగా ఉంటాయి.

9.తలస్నానానికి ఉపయోగించే కుంకుడు రసంలో కానీ, సీకాయపొడిలో కానీ అన్నం వార్చిన గంజిని కలిపి తల రుద్దు కుంటే వెంట్రుకలు త్వరగా నెరిసిపోవు.

10.షాంపూను ఉపయోగించే వారు ఆ నురగ తలమీది నుంచి, వెంట్రుకల కుదుళ్ళలోంచి పూర్తిగా తొలగి పోయేం త వరకు తలమీద నీళ్ళు పోసుకుని జుట్టును బాగా శుభ్రపరచాలి.

11.తలస్నానానికి ఎక్కువగా షాంపూను వాడితే, వాటిలోని రసాయనాలు కేశాలకు హాని చేస్తాయి. వెంట్రుకల మురికి, జిడ్డు వదలడానికి తగినంత షాంపూను మాత్రమే వాడాలి.

12.వెంట్రుకలను శుభ్రపరచటానికి అడ్డదిడ్డంగా రుద్దకూడదు. అల్లా చేస్తే వెంట్రుకలు చిక్కు పడడం, తెగిపోవడం జరుగుతుంది.

13.వెంట్రుకల తడిని పీల్చడానికి తలకు చుట్టే టవలు మెత్తగానూ, తేలికగాను ఉండాలి. రఫ్‌గానూ బరువుగానూ వుండకూడదు.

14. ఇతరులు వాడిన తువ్వాలను తల తుడుచుకోడానికి ఉపయోగించకూడదు.

15. తలను తుడుచుకునేటప్పుడు పై నుంచి క్రింది వరకూ తుడవాలి. ఎడా పెడా ఇష్టం వచ్చినట్లు తుడవకూడదు.

16. తలవెంట్రుకలను సహజ గాలిలోనే ఆరనివ్వాలి. హెయిర్‌ డ్రయ్యర్‌ వాడక పోవడమే జుట్టు ఆరోగ్యానికి మంచిది.

17. వెంట్రుకలు తడిగా వున్నప్పుడు తల దువ్వుకూడదు. ఆరిన తర్వాతనే తల దువ్వుకోవాలి.

18. వెంట్రుకలు చిక్కు పడినపుడు వేళ్ళతో మెల్లగా ఆ చిక్కును తీయాలి. ఆ తర్వాత తల దువ్వుకోవాలి.

19. తలస్నానం చేసిన తర్వాత వెడల్పు పళ్ళున్న దువ్వెనతో కానీ, తల దువ్వుకునే బ్రష్‌ను ఉపయోగిస్తూ వెంట్రుకలను పై నుంచి క్రిందకు మెల్లగా దువ్వుకోవాలి.

20. వెంట్రుకలు పూర్తిగా ఆరిన తర్వాతనే జడ వేసుకోవడం లేదా ముడి చుట్టుకోవడం చేయాలి.


=================================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.